అగర్వాల్ ఐ హాస్పిటల్‌లో ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్
డెక్కన్ న్యూస్, హెల్త్‌బ్యూరో: భారతదేశంలో నేత్రసంరక్షణ కేంద్రాల అతి పెద్ద నెట్‌వర్క్ లలో ఒకటైన డాక్టర్ అగర్వాల్స్ నేత్ర వైద్య శాల, డాక్టర్ అగర్వాల్స్ ఐ కనెక్ట్ ను ప్రారంభించింది, ఇది ఒక ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, దీని ద్వారా దేశవ్యాప్తంగా రోగులకు కంటి స్థితిగతులపై సలహాలు, రెండవ అభిప్రాయం, తదనంతర సేవలను అందించడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు. ఈ ఉచిత కన్సల్టేషన్ ఆగస్టు 15, 2021 వరకూ లభ్యమవుతుంది.
డాక్టర్ అగర్వాల్స్ ఐ కనెక్ట్ కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తమ ఇళ్ళలోనే సౌకర్యవంతంగా నాణ్యమైన నేత్ర సంరక్షణను కోరుకొనే రోగులకు ఒక వరంలా అందివచ్చింది. నిపుణులతో ఆన్‌లైన్ కన్సల్టేషన్‌ను బుక్ చేసుకోవడానికి రోగులు కాల్ (8879129186) చేయ్యవచ్చు లేదా https://www.dragarwal.comను సందర్శించవచ్చు. ఆన్‌లైన్ కన్సల్టేషన్ కోసం ఎటువంటి యాప్‌నూ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కటి ఇంటర్‌నెట్ కనెక్షన్, కెమెరా కలిగిన ఒక కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ సరిపోతుంది.
డాక్టర్ అగర్వాల్స్ ఐ కనెక్ట్ గురించి, డాక్టర్ అమర్ అగర్వాల్, ఛైర్మన్ డాక్టర్ అగర్వాల్స్ నేత్ర వైద్యశాల, మాట్లాడుతూ ఆన్‌లైన్ కన్సల్టేషన్ కోసం తమ సీనియర్ వైద్యుల బృందాన్ని ఆసుపత్రి సిద్దం చేసినట్టు తెలిపారు.
కొవిడ్-19, జీవనశైలిలో మార్పులు- ప్రత్యేకించి లాక్‌డౌన్ కారణంగా తెరముందు కూర్చొనే సమయాలు పెరగడం కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయనీ, కాబట్టి ఎలాంటి జాప్యం చెయ్యకుండా తమ కంటి ఆరోగ్యంపై రోగులు, ప్రజలు అదనపు శ్రద్ధ తీసుకోవడం, వైద్య సహాయాన్ని కోరడం ముఖ్యమనీ డాక్టర్ అగర్వాల్ తెలిపారు. కళ్ళ కలక, యువెటిస్, ధమనులు, సిరల్లో రక్తనాళాలు మూసుకుపోవడం, కంటి నాడీ వ్యాధులు లాంటి ఆరంభ నేత్ర సమస్యలకు కొవిడ్-19 ఇన్ఫెక్షన్ దారి తియ్యవచ్చని పేర్కొన్నారు.
2020లో నిర్వహించిన ఒక అంతర్గత సర్వేని డాక్టర్ అగర్వాల్ ప్రస్తావిస్తూ, కొవిడ్ మహమ్మారి మొదటి వేవ్ సందర్భంగా- లాక్‌డౌన్ నియంత్రణలు లేదా ఇన్ఫెక్షన్ ముప్పుపై భయాల వల్ల వైద్య సహాయాన్ని కోరడంలో జాప్యం చెయ్యడం వల్ల చాలా మంది రోగుల్లో కంటి పరిస్థితులు తీవ్రంగా క్షీణించాయన్నారు. కాబట్టి, ఏ కంటి సమస్యను నిర్లక్ష్యం చెయ్యకుండా, వీలైనంత త్వరగా వైద్య సాయాన్ని రోగులు తీసుకోవాలని సూచించారు.











