ఆషాడ‌మాస‌మ‌ని భార్య పుట్టింటికి… భ‌ర్త ఆత్మ‌హత్య అందుకే

ఆషాడ మాసంలో కొత్త పెళ్లైన స్త్రీలు పుట్టింటికి వెళ్తారు. కానీ త‌మిళ‌నాడులో మాత్రం ఓ యువ‌కుడి పాలిన మ‌ర‌ణ‌శాస‌నంగా మారింది. వివార‌ల్లోకి వెళ్తే… త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఈ ఘటన జోలార్‌పేట సమీపంలో చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట తామలేరి ముత్తూర్‌కు చెందిన దిలీపన్‌(33). తిరుపత్తూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌. ఇతను అదే ప్రాంతానికి చెందిన దివ్యను ఏడు నెలల ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆషాడమాసం(ఆడి నెల)లో భార్యను పుట్టింటికి పంపడంలో ఏర్పడిన గొడవలో అత‌ను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దివ్య ఎంబీబీఎస్‌ పూర్తి చేసి జోలార్‌పేటలోని మినీక్లినిక్‌లో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో గత 15వ తేదీ ఆషాఢమాసం నెల కావడంతో దివ్య పుట్టింటికి వెళ్లింది. దీంతో దిలీపన్‌ కుటుంబసభ్యులు దివ్యను పంపించాలని ఆమె తల్లిదండ్రులను అడిగారు. కానీ వారు తిరస్కరించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో విరక్తితో చెందిన దిలీపన్‌ బుధవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జోలార్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.