బోనాల పాటను కించపరిచిన మంగ్లీ, మండిపడుతున్న ప్రజలు
ఈ మధ్యకాలంలో మంగ్లీ పాడుతున్న పాటలు అందర్నీఆకట్టుకుంటున్నాయి. కొద్దిగా పేరు వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు పాటలు రాసి పాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు అని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా పూజించే దేవతను చెట్టుకింద కూసున్న మోతేవారి అంటూ కించపరుస్తూ బోనాల పండగ కోసం పాడిన పాటపై విమర్శలు వెలువెత్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా మంగ్లీని తిడుతూ, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ వారికి తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయం ఎట్లా తెలుసునని ప్రశ్నిస్తున్నారు. బేషరుతుగా మంగ్లీ క్షమాపణలు చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.