కేటీఆర్ అంటే ఎవరు అతను ? షర్మిల షాకింగ్ కామెంట్స్
పొట్టొని పొడుగొడు కొడితే…. పొడుగోని పోశమ్మ కొట్టింది అనే డైలాగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూగా వేసే పంచ్ ఇది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా… తన పంచ్‌లతో ప్రజలను నవ్విస్తారు అంతేగా వారిని తనదైన మాటలతో కించపరుస్తాడు. ఇప్పుడు సేమ్ టూ సేమ్ అదే పంచ్ డైలగ్ తిరిగి ఆయనకే తగిలింది. గతంలో కేసీఆర్ ఓ విలేకరుల సమావేశాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఎవడో తెల్వదు… నాకు వాడి సినిమాలు చూడను నేను.. ఓ చిరంజీవి తమ్ముడా అని అన్నాడు. అప్పట్లో ఇది పెద్ద దూమార్నే లేపింది.
తాజాగా అలాంటి సీన్ పునావృత్తం అయింది కానీ సీన్ లో ఉంది మాత్రం వైఎస్ఆర్ బిడ్డా షర్మిల. పార్టీ పెట్టిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశంలో ఓ విలేకరి కేటీఆర్ మీ పార్టీపై స్పందిచారు దానికి మీ స్పందన ఏంటీ అనే ప్రశ్నించారు. అయితే వెంటనే షర్మిల తనదైన శైలిలో కేటీఆర్ అంటే ఎవరో తెలియదు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా పక్కనే ఉన్నావారు ఆయన సీఎం కొడుకు అంటే… ఓ అవునా… సీఎం కొడుకా…చిన్న దొరనా… మహిళలు అంటే వ్రతాలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.