రాంకీలో అక్రమ లావాదేవీలు – ఎగ్గొట్టిన సోమ్ము కట్టేస్తాం
ప్రముఖ వ్యాపార సంస్థ రాంకీలో అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించి ఆదాయపుపన్ను శాఖ. రాంకీ సంస్థలోని ఆయా నిర్వహాణ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో అక్రమ ఆస్తులు వివరాలు బయటపడ్డాయని ఆదాయపన్నుశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 2018-19లో సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మోజార్టీ వాటను విక్రయించి భారీగా డబ్బును తీసుకున్నట్టు విచారణ వెల్లడైందని పేర్కొంది. ప్రభుత్వాన్ని దాదాపు 1200 కోట్ల రూపాయల ట్యాక్స్‌ను రాంకీ ఎగ్గొట్టినట్టు విచారణలో తెలింది. అంతే కాకుండా ఆదాయాన్ని దాచిపెట్టి 288 కోట్ల నష్టం చూపించారని ప్రకటనలో పేర్కొంది. లెక్కల్లోకి రాని మరో 300 కోట్లతో పాటు ప్రభుత్వానికి ఎగ్గొటిన ట్యాక్స్‌ను తిరిగి చెల్లించడానకి రాంకీ సంస్థ ఒప్పుకున్నట్టు తెలిపింది.