ధరిపల్లిలో కన్నుల పండుగగా ద్వజస్తంభన ప్రతిష్టాపన
ధరిపల్లి గ్రామంలో అతిపురాతనమైన శివాలయంలో కన్నులపండుగా ద్వజస్తంభన ప్రతిష్టాపన జరిగింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు పొరుగు గ్రామాల నుండి పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. రంగపేట మాదావనందస్వామి దీవ్య ఆశ్సీసులతో ఈ ఉత్సవాలు జరిగినట్లు నిర్వహాకులు వెన్నవెల్లి బాగన్నగారి పురుషోత్తంరెడ్డి తెలిపారు. శివాలయంలో ఏర్పాటు చేసిన ద్వజస్తంభం వరంగల్ జిల్లాలో తయారు చేశారని, ద్వజస్తంభంతో పాటు హనుమాన్ విగ్రహం పునఃప్రతిష్టాపన కూడా చేశామన్నారు. ఈ ఉత్సవాల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వెన్నవెల్లి బాగన్నగారి కమలాసన్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో అతిపూరతనమైన దేవాలయం ఈ శివాలయంలో అనాధిగా వందల సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్నా ఈ దేవాలయంలో ద్వజస్తంభన ప్రతిష్టాపన చేయండ సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ది గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిచారని తెలిపారు. ఇలాంటి ఐక్యత ఉంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు.