ఈటలను లైట్ తీసుకోవద్దు
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను లైట్‌గా తీసుకోవద్దని తెరాస చెబుతోంది. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఏడేళ్లు మంత్రిగా పని చేసిన అనుభం మరీ ముఖ్యంగా స్థానిక నేతలతో ముఖ పరిచయం. ఇవన్ని పరిగణలోకి తీసుకొని ఉప ఎన్నికలను ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అటు ఈటల కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. తన భవిష్యత్తు రాజకీయం మీద దెబ్బకొట్టిన వారికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెబుతారని అంటున్నారు ఈటల. ఈ ఎన్నికల్లో ఈటల ఓటిమి చెందింతే అతని భవిష్యత్తు రాజకీయాల మీద ముద్ర పడుతుంది. గెలిస్తే కనుక పార్టీతో పాటు తన ముద్ర కూడా ఉందని అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేసినట్లే. ఈ ఎన్నికను అధికార పార్టీ కూడా అంతే కసితో తీసుకోనున్నది. అధికార పార్టీ నుండి వచ్చినా… పార్టీ లేనిదే అక్కడ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే హెచ్చరికలు ప్రజలకు తెలయజేయాలనే ఆలోచనలో తెరాస ఉన్నట్లు సమాచారం.
కలిసొచ్చే సంజయ్ పాదయాత్ర
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసే పాదయాత్ర ఈ ఎన్నికలకు కలిసివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు స్థానిక రాజకీయ నాయకులు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు భాజపా బలం భారీగా పెరిగిందనే చెప్పుకోవాలి. అధికారపార్టీ నుండి మంత్రి పదవి నుండి వచ్చి భాజపా చేరడం పెద్ద రాజకీయ పరిణామమే. అయితే ఇటు ఈటల అటు కేసీఆర్ కూడా ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్లు చూస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలు ఓ రాజకీయ సంచలనమే అని చెప్పుకోవచ్చు.