ఈటల తర్వాత జగదీష్ అంట
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు, ఇంట్లో మనిషిగా పేరు పొందిన వ్యక్తి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ అన్ని వేళలా…. అందుబాటులో ఉండి ఆయన బాగోగులు చూసుకునే వ్యక్తి అని పేరుంది. అయితే ఇటీవల వస్తున్న ఆరోపణలు ఆయన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తారు అనే వార్తలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చిన కథనం ఇప్పుడు అగ్గికి అజ్యం పోస్తోంది. జనవరి నెలలో మంత్రి జగదీష్ రెడ్డి కొడుకు పుట్టిన రోజు వేడుకలను కర్నాటక రాష్ట్రం హంపిలో చేశారు. అప్పటి నుండి రాజకీయ సమీకరణాలు తారుమారువుతన్నాయి. అక్కడి నుండి కేసీఆర్ పతనానికి నాంది పలకాలని కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు పావులు కదిపారని సమాచారం. అయితే అప్పట్లో ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డా ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. పార్టీలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడాకున్నారని సమాచారం. పాటలు పాడే ఎమ్మెల్యే, ప్రభుత్వంలో కీలక పోస్ట్ పదవి అనుభవించిన వ్యక్తి కూడా కేసీఆర్ తీవ్రమైన పరుషపదజాలంతో అక్కడ మాట్లాడరని, ఏకంగా ఒక ఎమ్మెల్యే తన పాటలతో కేసీఆర్ విరుచుకపడ్డారని సమాచారం. కాగా ఈటల వ్యవహారంలో సీఎం మోనార్క్ లాగా వ్యవహారిస్తున్నారని అక్కడ చర్చ జరిగిదంట. అయితే ఆ పార్టీకి హాజరైన తొలిసారి గెలిచిన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అక్కడి విషయాలను పూసగుచ్చినట్లు అందించారని సమాచారం.అయితే పార్టీ ముగిసిన తర్వాత ఆ పార్టీకి వెళ్లిన ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ పిలిచి మందలించారు అనే వార్త కూడా అప్పట్లో బలంగానే వీసింది. కాగా సీఎంకు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు, తెరాస కరపత్రంగా మారిన నమస్తే తెలంగాణ దినపత్రికలో కీలక పదవిలో ఉన్న జగదీష్ రెడ్డి బంధువు ఇలా అన్నింటిలో సీఎం కనుసన్నల్లో ఉండే జగదీష్ రెడ్డి పాపం ఏంటీ…. ఆ పాపమే ఇప్పుడు మంత్రి పదవిని తొలగిస్తుందా అనేది చర్చనీయశంగా మారింది.