త‌గ్గిన వంట గ్యాస్ ధ‌ర

దేశంలో ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌ పై రూ. 122 తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్(ఐఓసీ) 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.122 త‌గ్గిస్తున్న‌ట్లు త‌మ వెబ్ సైట్లో తెలిపింది. అయితే డొమెస్టిక్ గా వాడే 14 కేజీల గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లో మాత్రం ఎలాంటి మార్పు లేద‌ని చెప్పింది.
త‌గ్గిన ధ‌ర‌తో ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కి చేరింది. ముంబైలోరూ.1422కు, కోల్‌కతాలో రూ.1544కు, చెన్నై లో కూడా సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది. ఇక 14 కేజీల గ్యాస్ సిలిండర్ ఢిల్లీ లో 14 కేజీల గ్యాస్ సిలిండర్‌ ధర రూ.809 గా ఉంది. . కోల్‌కతాలో రూ.835, ముంబైలో సిలిండర్ ధర రూ.809గానూ, చెన్నైలో రూ.825 గా హైదరాబాద్‌లో 861.50 గానూ ఉంది.