జనసేన కిడ్నాప్ డ్రామా.. కంగుతిన్న నేతలు
తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులే కిడ్నాప్ చేశారని ఆరోపణలు గుప్పించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు)
షాహిద్ కనబడటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. వినుత ఇంట్లో సోదాలు జరిపేందుకు రేణిగుంట పోలీసులు యత్నించగా జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్, ఇతర నాయకులు అడ్డుకున్నారు. తాము తలచుకుంటే కేంద్ర హోం శాఖ దిగుతుందంటూ బెదిరింపులకు దిగారు. జనసేన నాయకురాలు నగరం వినుత, కోట చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి డ్రామా బెడిసికొట్టడంతో జనసేన నేతలు కంగుతిన్నారు. (ఇది ఫెవికాల్ బంధం)