కేంద్ర మంత్రిగా ఈటెల ?
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తు నిర్ణయం దగ్గరపడినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుండి ఉద్వాసన పలికిన తర్వాత ఆయన భాజపా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరగ్గా మరోపక్క కొత్తపార్టీ పెడుతారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల భాజపా సీనియర్ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో భేటీ మరింత ప్రాధన్యం సంతరించుకుంది. ఈటెల భాజపాలోకి వస్తే మంచి ఆఫర్ ఇస్తామని వెల్లడించినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో భాజపా బలంగా నాటుకుపోవడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈటెల ద్వారా తెరాస అసమ్మతి నేతలు గాలం వేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. కాగా ఈటెల భాజపాలోకి వస్తే రాజ్యసభ్యుడిగా నియమించి కేంద్రంలోని కీలక శాఖ సహాయ మంత్రిగా చేస్తారని భాజపా అనున్నకుట్లు సమాచారం. అయితే తాను భాజపాలో చేరుతానని ఇప్పటి వరకు ఈటెల ప్రకటించలేదు. కొత్తపార్టీ పెడుతారా లేక కాంగ్రెస్, భాజపాలోకి వెళ్తారా అనేది స్వయంగా ఈటల చెబితేనే స్పష్టంగా తెలియనుంది. అయితే ఈటెల వర్గీయులు మాత్రం భాజపాలోకి వెళ్తేనే భవిష్యత్తు బాగుటుందని అంటున్నారు.