ఈటెలపై మండిపడ్డ గ్రామస్థులు
మాజీ మంత్రి ఈటెల మంత్రి పదవి ఊడిన తర్వాత కూడా దొర మాదిరిగానే మాట్లాడుతున్నారని అచ్చంపేట, హాకీంపేట, ధరిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌ని ఇంకా బతిమిలాడినట్టే మాట్లాడుతున్నారని ఆయన అక్కసు వెల్లగక్కలేదని, మా గ్రామాల గురించి చిన్నచూపులా మాట్లాడడం సరికాదన్నారు. మాజీ మంత్రి ఈటెల ఇటు అచ్చంపేట, హాకీంపేట, దేవయాజంల్ గ్రామాల గురించి చులకను మాట్లాడినట్లు స్పష్టం అవుతుంది. నేను వెళ్లిన తర్వాత అక్కడ రోడ్డు పడింది అంటున్నారు. అయితే తాము పుట్టినప్పటి నుండి మా ఊరికి రోడ్డే లేదా అని ప్రశ్నించారు. నీవు ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేసి, ప్రజలకు సేవ చేస్తున్నావా లేక రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావా అని ఎదురు ప్రశ్నించారు. ఉత్తపుణ్యానికి వచ్చిన భూములను మీ అధికార బలంతో, డబ్బు బలంతో అడివిని నాశనం చేశావు అని, ఆ పాపం ఊరికే పొదన్నారు.











