అచ్చంపేటలో అసలేమి జరిగింది

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఈటలను బలి పశువు చేశారు అని ఇప్పుడు రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతోంది. అసలు అచ్చంపేటతో మాజీ మంత్రి ఈటల ఉన్న సంబంధం ఏంటి? అసలు అక్కడ జరిగిన పరిమాణం ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన విజయం. ఈ విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ చేసిన డెక్కన్ న్యూస్ ఆ విషయాలను మీ ముందుకు తీసుకవస్తుంది.

మెదక్ జిల్లా పూర్వపు వెల్దుర్తి మండలంలో భాగమైన అచ్చం పేట, హాకింపేట, గోపాలకృష్ణ పురం ( పాకాల) అలియాస్ డబ్బులోళ్ళ గుడిసెలు ఈ మూడు గ్రామాలు ఒకే పంచాయతీ కింద ఉండేవి. ఈ గ్రామానికి సమీపంలో చిన్న శంకరంపేట మండలంలోని ధరిపల్లి గ్రామం. ఈ ఊర్ల చుట్టూ… దట్టమైన అడవి ఉండేది. 1994 ప్రాతంలో అచ్చంపేట, హాకింపేట, ధరిపల్లి లోని కొంతమందికి గ్రామ ప్రజలకు అసైన్డ్ ల్యాండ్ కింద అప్పటి ప్రభుత్వం భూములను మంజూరు చేసింది. కానీ ఆనాటి నుండి గత నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఎక్కడ కూడా వ్యవసాయం చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ అడవిలో భాగమమైన హాకింపేట శివారులో హల్దీ ప్రాజెక్ట్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని మొదట గోపాల కృష్ణ పురం గ్రామ సమీపంలో వి ఆర్ ఆర్ ఫామ్ పేరిట ఆడివిల నుండి వచ్చే నీళ్లను అడ్డుకునేల ప్రాజెక్టు శిఖం అంచులో మామిడి తోట పెట్టారు. ఇది ఈ అడవుల భూములు నాశనం చేయడానికి పడిన మొదటి బీజం. దీని తరువాత చాలా మంది దట్టమైన ఆడివిని నరికి పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లు కడుతున్నారు.

నాలుగేళ్ళ క్రితం ఈ భూములపై కన్నేసిన మాజీ మంత్రి ఈటల అచ్చంపేట శివారులో ఆడివిని నరికి పెద్ద పెద్ద కోళ్ల హ్యాచరి ఫామ్ లు పెట్టారు. ఇందుకు అవసరమైన మట్టిని కూడా అక్రమంగా… అచ్చంపేట చెరువులో నుండి తరలించారు. ఇందుకోసం స్థానిక తెరాస నాయకుడు, కాంట్రాక్టర్ సహాయం చేసాడు. ఇలా తన సామ్రాజ్యాన్ని పునాదులు వేసి ఈటెల. మరింత విస్తరణలో ఆడివిని పూర్తిగా.. నాశనం చేసి దళితులు భూములు, బడుగు బలహీన వర్గాల ప్రజల భూములపై కన్నేసి ఇప్పుడు ఉన్న ఫారంలకు దగ్గరలో మళ్ళీ పెద్ద పెద్ద ఫారం కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఫారంల కోసం ప్రత్యేకంగా దాన కంపెనీ నుండి భారీ నిర్మాణం చేపట్టారు. ఈ దాన కంపెనీల సమీపంలో మరిన్ని కట్టడాలు చేపడుతున్న తరుణంలో భాదితులు సర్కారు కి ఫిర్యాదు చేయడం తరువాత కథ మీకు తెలిసిందే.

అయితే ఇక్కడ ఈటెల అనుచరులు, బినామిలతో పాటు అచ్చంపేటకు చెందిన స్థానిక నాయకుడు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని మళ్ళీ భాదితులకు ఇస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నర్ధకంగా మారింది.

మరో గ్రౌండ్ రిపోర్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది డెక్కన్ న్యూస్.