అయినా కానీ.. మెద‌క్ ఎందుకో వెన‌క‌బ‌డింది.

మెద‌క్ చేసిన పాపం ఏందీ? ‌సిద్దిపేట చేసిన పుణ్యం ఏందీ?

మెద‌క్‌, సిద్ధిపేట, సంగారెడ్డి ప్రాంతాలు ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాల్లో ఓ భాగం. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి త‌ర్వాత మూడు జిల్లాలుగా అవ‌త‌రించింది మెదక్ జిల్లా. ఇప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉంది. కానీ మెద‌క్ అభివృద్ధిలో మాత్రం ఆకాశానికి, భూలోకాని ఉన్నంత దూరంలో ఉంది. అస‌లు మెద‌క్ చేసిన పాపం ఏంటీ ? సిద్దిపేట చేసిన పుణ్యం ఏంటీ ?

వాస్త‌వంగా ఆలోచిస్తే… ఉమ్మ‌డి జిల్లా నుండి విడిపోతే… అప్ప‌టికే జిల్లా కేంద్రంగా ఉన్న మెద‌క్ మ‌రింత అభవృద్ధి చేందాలి. కానీ భిన్నంగా మెద‌క్‌కి బ‌దులుగా సిద్దిపేట అభివృద్ధిలో దూసుకపోతోంది. అంటే దీనికి గ‌ల కార‌ణం ఒక్క‌టే అని వినిపిస్తోంది. అదే స‌మ‌ర్ధ‌మంత‌మైన నాయ‌కత్వం లేక‌పోవ‌డం. ఉద‌యం లేస్తే చాలు మంత్రి హారీష్‌రావు జ‌పం చేసేవారే. చివ‌రికి మెద‌క్ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి కూడా హారీష్‌రావు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అనే బ‌హాటంగా తెలిసిన నిజం.అయితే హారీష్‌రావు కోట‌రిలో ఉన్న పద్మ‌దేవేంద‌ర్‌రెడ్డి త‌న సొంత నియోజ‌ర‌వ‌ర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోవ‌డం లేదంటే… నియోజ‌క‌వ‌ర్గంపై చిన్న చూపేనా.. లేక గులాబీ వ‌ర్గం మెద‌క్‌లో గ‌ట్టి ఉంది అన్నా అతి న‌మ్మ‌క‌మా అనేది ఇప్ప‌డు ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.
గ‌తంలో మెద‌క్‌కి ఔట‌ర్ రింగ్‌రోడ్డు, మెద‌క్‌ను పూర్తిగా అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజి తీసుకువ‌స్తామ‌ని సీఎం చెప్పిన‌ప్పుడు, ఆమాయ‌కురాలిగా ఎమ్మెల్యే ఎవ‌రూ చ‌ప్ప‌ట్లు కొట్ట‌కున్నా… ఎగిరేగిరి చ‌ప్ప‌ట్లు కొట్టారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. కానీ సిద్దిపేట పట్టాణానికి మాత్రం చూట్టు రింగ్ రోడ్డు, అద్దాలాంటి రోడ్లు. ఇది పూర్తిగా నాయ‌క‌త్వ లోప‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని అంటున్నారు మెతుకు సీమ ప్ర‌జలు. మెద‌క్ ప‌ట్టాణాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దాలి అంటే ప‌ట్ట‌ణంలో ఆసియా ఖండంలోనే రెండ‌వ అతిపెద్ద చ‌ర్చి, అలాగే పూర‌న‌మైన ఖిలా, మెద‌క్ స‌మీపంలో కొంటూరు చెరువు, పోచారం డ్యాం, ఏడుపాయ‌ల దేవాలయం, భార‌త‌దేశంలోనే అతి పెద్ద జాతీయ ర‌హదారికి అతి స‌మీపంలో హాల్దీ ప్రాజెక్ట్ ఇలా చెప్ప‌కుంటూ పోతుంటే అనేక సుంద‌ర‌మైన ప్ర‌దేశాలు మెద‌క్‌లో ప‌కృతిలో వెలిశాయి. అయినా కానీ మెద‌క్ ఎందుకో వెన‌క‌బ‌డింది.

కానీ సిద్దిపేట ఇలాంటి క‌ట్ట‌డాలు కానీ, పకృతిలో వెలిసన‌వి ఏమి లేవు అయినా కానీ సిద్ధిపేట ఎందుకో అభివృద్ధి చెందింది. దీనికి కార‌ణం మాత్రం ఎవ్వ‌రూ నమ్మినా.. న‌మ్మ‌క‌పోయినా బ‌ల‌మైన హారీష్‌రావు నాయ‌క‌త్వం మాత్రంమే..

మెద‌క్ అతి సమీపంలో ఉన్న కొంటూరు చెరువును ప‌ర్యాట ప్రాంతంగా తీర్చిదిద్దూతామ‌ని చెప్పారు. సిద్దిపేట‌లో కోమ‌టిబండను అంద‌నంత ఎత్తుకు అభివృద్ది చేశారు.
అందుకే మెద‌క్ ప్ర‌జ‌లు బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నారు. తెరాస ఉంటే ప‌ద‌వులు వ‌స్తాయి కానీ అభివృద్ది చేయ‌లేరు. వారికి కావాల్సింది ప‌ద‌వులు త‌ప్పా అభివృద్ధి కాదు.
మెద‌క్ ప‌ట్ట‌ణంలో క‌నీసం ఒక్క ట్రాఫిక్ సిగ్న‌ల్ కూడా లేక‌పోడం సిగ్గు చేటు అని కాంగ్రెస్ నాయ‌కులు, టీపీసీసీ కార్య‌ద‌ర్శి మాడ్యం బాల‌కృష్ణ‌ అన్నారు. అధికారంలోకి వ‌చ్చి ఏడేళ్లు గ‌డిచినా… రోడ్డు మీద ఉన్న‌.. డివైడ‌ర్‌ని స‌రిగా చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌తి ప‌నిలో పైస‌లు తింటున్నారే త‌ప్పా… ఎక్క‌డా కూడా అభివృద్ధి చేయ‌డం లేద‌న్నారు. మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాలంటే.. బ‌ల‌మైన నాయ‌కుడు కావాలి అన్నారు. ఈ మార్పు భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల్లో త‌ప్పాకుండా వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.