నెలల పసికందుకు సిటిజెన్స్ హాస్పిట‌ల్స్‌లో ప్రాణదానం

· పుట్టుకతోనే PUJ అడ్డంకితో బాధపడుతున్న 17 నెలల శిశువుకు రోబోటిక్ పైలోప్లాస్టీ సర్జరీతో ప్రాణదానం.

పెల్విక్ యురేటెరిక్ జంక్షన్ (పియుజె) అవరోధంతో బాధపడుతున్న 17 నెలల చిన్నారికి హైదరాబాద్ సిటిజెన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది.

ఈ వయస్సు గల పిల్లలకు రోబోటిక్ శస్త్రచికిత్స జరగడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే మొదటిసారి. డాక్టర్ మల్లికార్జున రెడ్డి 20 సంవత్సరాలుగా పీడియాట్రిక్ యూరాలజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న అగ్రశ్రేణి వైద్య నిపుణులు , వారి ఆధ్వర్యంలో సిటిజన్స్ హాస్పిటల్స్ లోని ప్రత్యేక పీడియాట్రిక్ యూరాలజీ విభాగం లో సేవలు అందిస్తున్నారు.

వెల్లోర్ కు చెందిన శిశువులో ఈ లోపాన్ని పుట్టినప్పుడే గుర్తించారు. అప్పటి నుండి డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారి సంరక్షణలో ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. చిన్నారిలో ఎర్పడ్డ అడ్డంకి పరిమాణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ అడ్డంకిని తొలగించడానికి శస్త్రచికిత్స మాత్రమే ఉత్తమ మార్గం. ఆ చిన్నారి కుటుంబం రోబోటిక్ శస్త్రచికిత్సను ఎంచుకుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో సర్జన్ తన చేతులను ఆ పసివాని శరీరంలో ఉంచకుండానే అడ్డంకిని తొలగించవచ్చు.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం పీడియాట్రిక్ యూరాలజీలో మొదలైన రోబోటిక్ సర్జరీ క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. మిగతా శస్త్రచికిత్సల ఫలితాలతో చూస్తే ఇది సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది.

రోబోటిక్-అసిస్టెడ్ పైలోప్లాస్టీతో వస్తున్న అద్భుతమైన ఫలితాలు ఇతర వైద్య విధానాలకు సవాలు విసిరాయి. సాంకేతిక పురోగతి, హై-డెఫినిషన్ కెమెరాల వంటి ఆధునిక సాధనాలు రోబోటిక్ శస్త్రచికిత్స పురోభివ్రుద్ధికి దోహదం చేశాయి. ఇది PUJ అబ్ స్ట్రక్షన్ చికిత్సలో కొత్త ప్రమాణాలను సృష్టించింది.

పుట్టుకతోనే PUJ అవరోధం ఉన్నట్లు నిర్ధారణ అయిన 17 నెలల శిశువుకు మేము రోబోటిక్ పైలోప్లాస్టీ చేసాము. రోబోటిక్ సర్జరీ లోని ఖచ్చితత్వం వల్ల పిల్లల శరీరంలో లోతుగా ప్రవేశించాల్సిన అవసరం ఉండదు. శస్త్రచికిత్స ఫలితాలు 98-100% వరకు ఉన్నాయి ”అని హైదరాబాద్ సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి చెప్పారు.

“సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో, మాకు ప్రత్యేకమైన పీడియాట్రిక్ రోబోటిక్ సర్జరీ బృందం ఉంది. డా విన్సీ ఎక్స్ వంటి అత్యంత అధునాతన సాధనాలతో అవసరమైన చోట సంక్లిష్ట ఆపరేషన్లు చేయడానికి సర్జన్లకు అవకాశం కల్పిస్తుంది, ”అన్నారాయన.

యూరిటెరిక్ రీఇంప్లాంటేషన్, మూత్రాశయ మరమ్మతు, మరియు మూత్రం అదుపు చేసుకోలేని వారికోసం మిట్రోఫనాఫ్ వంటి శస్త్రచికిత్సలు సులభంగా మరియు ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చు, దీనివల్ల శస్త్రచికిత్స తరువాత నొప్పి, రక్తం కోల్పోవడం వంటివి తక్కువగా ఉంటాయి. అంతేకాదు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

పీడియాట్రిక్ యూరాలజీలో మరిన్ని పునర్నిర్మాణ విధానాలు అవసరం. అందువల్ల రోబోటిక్ శస్త్రచికిత్స ఎంచుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం. ఇందులో తక్కువ నొప్పి మరియు మచ్చలు లేని చికిత్స అందుతుంది. ఈ తాజా శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం మరియు తక్కువ కోత వల్ల పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది.