సాధరణ ప్రజలకు కిమ్స్ కర్నూలులో కోవిడ్ వ్యాక్సిన్
వృద్దులకు, సాదారణ ప్రజలకు విజయవంతంగా కోవిడ్-19 టీకాలు వేయడం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కిమ్స్ కర్నూలు ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ సెంటర్ హెడ్ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. వృద్దులకు, 45 నుండి 59 ఏళ్ల వయస్సు గల వారికి టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. కానీ 45 నుండి 59 ఏళ్ల వరకు ఉన్న వారు వైద్యుల నుండి మెడికల్ సర్టిఫికెట్ తప్పిని సరిగా తీసుకురావాలని సూచించారు. 60 ఏళ్లు దాటిన వారందరీ టీకాలు వేస్తున్నామని తెలిపారు. దాదాపు 20 మందికి పైగా ఈ టీకాలను వినియోగించుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా టీకా తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ని కట్టడి చేయండంలో బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
టీకాలు తీసుకున్న తర్వాత చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే అపోహ విడనాలని అన్నారు.
టీకా వేసిన అరగంట వరకు వైద్యుడి సంరక్షణలో తనిఖీ చేస్తారని, టీకా విషయంలో అపోహలు ఉంటే తమ తమ వైద్యులను సంప్రదించి నివృత్తి చేసుకోవలన్నారు.
ఈ రోజు కిమ్స్ హాస్పిటల్‌లో రాఘమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి కుటుబం సమోతంగా కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.