40 ల‌క్ష‌ల ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ చేస్తాం : ‌రాకేశ్ తికాయ‌త్‌

హ‌స్తినా వేదిక‌గా కొన‌సాగుతున్న రైతు ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేస్తామంటున్నారు రైతు నాయ‌కులు. రైతుల‌ను కొలుకొని దెబ్బ కొట్టేలా… కార్పొరేట్ రంగాల‌కు ల‌బ్ధి చేకూరేలా నూత‌న చ‌ట్టాలు ఉన్నాయ‌ని మండిప‌డుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో 70 రోజులకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమాన్ని దేశమంతా విస్తారమని తెలిపారు. హర్యానా, కురుక్షేత్ర జిల్లాలోని పెహోవాలో నిర్వమించిన ‘కిసాన్ మహాపాంచాయతీ’లో ప్రసంగిస్తూ రైతు నాయకుడు ఈ ప్రకటన చేశారు. రాకేశ్‌ తికాయత్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ ఇంతవరకు ఒక్క ఆందోళనలో కూడా పాల్గొనలేదు. ఆయన చేసే పని ఏంటంటే దేశాన్ని విడగొట్టడం మాత్రమే. ఆందోళన జీవుల గురించి ఆయనకు అసలు ఏం తెలుసు. భగత్‌ సింగ్‌ నుంచి బీజేపీ నాయుకులు ఎల్‌కే అద్వానీ వరకు ప్రతి ఒక్కరు ఆందోళనలో పాల్గొన్నారు. మోదీ ఇలాంటి వాటికి దూరం. అందుకే ఆయనకు దీని గురించి తెలియదు’ అంటూ మండిపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2 వరకు రైతుల ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించారు రాకేశ్‌ తికాయత్‌. ‘‘ఆ తర్వత కూడా ఉద్యమం ఆగిపోదు. విడతల వారిగా రైతులందరం దీనిలో పాల్గొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఇక తర్వలోనే నలభై లక్షల ట్రాక్టర్లు.. మీరు విన్నది కరెక్టే.. నాలుగు కాదు 40,00,000 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం’’ అని తెలిపారు.