వివిధ శ్రేణుల్లో 2020 రీసేల్ విలువలను అప్‌డేట్ చేసిన డ్రూమ్ ఆరెంజ్ బుక్ వ్యాల్యూ
తమ తమ సెగ్మెంట్లలో అత్యధిక రీసేల్ వ్యాల్యూ కైవసం చేసుకున్న మారుతీ సుజుకీ సియాజ్, ఎంజీ హెక్టర్
యూజ్డ్ కార్ల విక్రయం, కొనుగోలుకు సంబంధించి భారతదేశవు నమ్మకమైన సంస్థ డ్రూమ్ – తన తాజా ఆరెంజ్ బుక్ వ్యాల్యూ (ఓబీవీ) సర్వేనుప్రకటించింది.. ఎస్‌యూవీ, సెడాన్, హ్యాచ్‌బ్యాక్ సహ ఇతర అన్ని శ్రేణులకు చెందిన ప్రముఖ వాహనాల రీసేల్ విలువకు సంబంధించిఅనేకఅంతర్గత విషయాలను ఈ సర్వే ప్రస్తావించింది.
తాజా సర్వే ప్రకారం సీ- సెగ్మెంట్‌లో ఎంజీ హెక్టర్ అత్యధిక విలువను (సంవత్సర కాలానికి 90%)అందిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మహీంద్రా XUV500, జీప్ కాంపాస్, టాటా హ్యారియర్ నిలిచాయి. సెడాన్ శ్రేణిలో మారుతీ సుజుకీ సియాజ్ ముందు వరుసలో ఉంది. హోండా సిటీ, హ్యుండై వెర్నా, స్కోడా ర్యాపిడ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉచితంగా ఉపయోగించుకోగలిగే ఒక అంతర్జాతీయ ప్రొడక్ట్‌ఓబీవీ. దాదాపు 38 దేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ సహకారంతో ఓబీవీ 10 సెకన్లలోనే యూజ్డ్ వాహనాల ధరను తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఓబీవీ వేదికగా 450 మిలియన్ ధరల పరిశీలన జరిగింది.
ఈ సందర్భంగా డ్రూమ్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, అక్షయ్ సింగ్ మాట్లాడుతూ, “ డ్రూమ్‌లో మేము కఠినమైన వాహన అసెస్‌మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తాం, అది 1000+ పేరామీటర్లలో ఉపయోగించిన కార్లను విశ్లేషిస్తుంది. వాహనంపై ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి కచ్చితమైన విలువను మా ఖాతాదారులు అందుకునేలాచూస్తుంది. వివిధ సెగ్మెంట్లలో పనితీరు, ఆధారపడే హామీకి సంబంధించి చాలా ఆటోమొబైల్స్ సంస్థలు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాయని ఓబీవీ తాజా ట్రెండ్స్ తెలుపుతున్నాయి.ప్రస్తుతం మార్కెట్‌లో ఎంజీ హెక్టర్, మారుతీ సుజుకీ సియాజ్ వంటి వాటికి గొప్ప రీసేల్‌విలువ కనిపిస్తోంది, వాటి విషయంలో కస్టమర్లు దృష్టి సారించవచ్చు” అన్నారు.
డ్రూమ్‌కు చెందిన ఓబీవీ ఒక తెలివైన ఆల్గోరిథమిక్ ప్రైసింగ్ ఇంజిన్. ఇది అమెరికాలో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఒక పెటెంట్‌తో శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగించిన వాహనాల ధరను కచ్చితంగా అంచనా వేస్తుంది. కార్లు, బైకులు, స్కూటర్లు, బైసైకిల్స్, ప్లేన్స్ సహ 5 మిలియన్+ ఉత్పత్తులను ఓబీవీ కవర్ చేస్తుంది. ఆరెంజ్ బుక్ వ్యాల్యూకు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.orangebookvalue.comసందర్శించండి.
ఆరెంజ్ బుక్ వ్యాల్యూ గురించి
ఓబీవీ భారతదేశపు మొట్టమొదటి ఏకైక ఆల్గోరిథమిక్ ప్రైసింగ్ ఇంజిన్. ఇది ఏదైనా ఉపయోగించిన వాహనాపు సరైన మార్కెట్ విలువను 10 సెకన్లలో తెలియజేస్తుంది, అది కూడా ఉచితంగా. ఆరెంజ్ బుక్ వ్యాల్యూ ఒక సులువైన డేటా సైన్స్ ఆధారిత ఆన్‌లైన్ టూల్. ఇది ఉపయోగించిన ఆటోమొబైల్ విలువను 10 సెకన్లలోనే లెక్కిస్తుంది. ఆవిష్కరించిన నాటి నుంచి ఓబీవీ వేదికగా 450 మిలియన్లకు పైగా ధరల పరిశీలన జరిగింది. కార్లు, బైకులు, స్కూటర్లు, బైసైకిల్స్, ప్లేన్స్ సహ 5 మిలియన్+ ఉత్పత్తులను ఓబీవీ కవర్ చేస్తుంది. డ్రూమ్‌తో పాటు వెబ్‌సైట్‌లోనూ, iOS, ఆండ్రాయిడ్ యాప్, థర్డ్ పార్టీ బ్లాగర్లకు ఓబీవీ విడ్జెట్, ప్రైసింగ్ యాజ్ ఏ సర్వీస్‌డ్యాష్‌బోర్డ్, ప్రింట్ ఎడిషన్ (PaaS)గా ఓబీవీ అందుబాటులో ఉంది. ఆరెంజ్ బుక్ వ్యాల్యూకు సంబంధించి మరిన్ని వివరాల కోసంwww.orangebookvalue.comసందర్శించండి.
###