ఎంసిఎల్‌ఆర్ తగ్గించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ను ఓవర్‌నైట్ మరియు 1 నెల కాలవ్యవధిలో వరుసగా 15 బేసిస్ పాయింట్లు మరియు 5 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఓవర్‌నైట్ ఎంసిఎల్‌ఆర్ 6.75% నుండి తగ్గి ఇప్పుడు 6.60% వద్ద ఉంది, మరియు 1 నెల ఎంసిఎల్‌ఆర్ 6.75% నుండి తగ్గి ఇప్పుడు 6.70% వద్ద ఉంది. సవరించిన ఎంసిఎల్‌ఆర్ 11 జనవరి 2021 నుండి అమలులోకి వస్తుంది.

11 జనవరి, 2021 నుండి సవరించిన ఎంసిఎల్‌ఆర్, ఈ క్రింది విధంగా ఉంది:

కాలవ్యవధి
ఎంసిఎల్‌ఆర్ (%)
ఓవర్‌నైట్ ఎంసిఎల్‌ఆర్ 6.60%
1 నెల ఎంసిఎల్‌ఆర్ 6.70%
3 నెలల ఎంసిఎల్‌ఆర్ 6.90%
6 నెలల ఎంసిఎల్‌ఆర్ 7.05%
1 సంవత్సర ఎంసిఎల్‌ఆర్ 7.20%