అత్యంత అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో ప్రాణాపాయం

  • మ‌హిళ ప్రాణాలు కాపాడిన కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి వైద్యులు
  • సిజేరియ‌న్ స్కార్ (ఎక్టోపిక్‌) గ‌ర్భం అత్యంత అరుదైన స‌మ‌స్య‌
  • ప్ర‌తి 3 వేల మంది గ‌ర్భిణుల‌లో ఒక‌రికే ఈ ప్ర‌మాదం
  • తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌తో కొన్ని గంటల్లోనే మ‌ర‌ణించే అవ‌కాశం

హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 28, 2020: కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో ప‌లు విభాగాల‌కు చెందిన వైద్య‌నిపుణుల సంయుక్తంగా కృషిచేసి, ఒక మ‌హిళ ప్రాణాలు కాపాడారు. సిజేరియ‌న్ స్కార్ (ఎక్టోపిక్‌) గ‌ర్బం అనే అత్యంత అరుదైన స‌మ‌స్య‌తో ఆమె బాధ‌ప‌డుతున్నారు. దానివ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం సంభ‌వించి, గ‌ర్భాశ‌యం చిరిగిపోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇలాంటి స‌మ‌స్య ఉన్న మ‌హిళ‌లు కొన్ని గంటల్లోనే మ‌ర‌ణించే అవ‌కాశం కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఉంటుంది!

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన 29 ఏళ్ల మ‌హిళ‌కు తీవ్రంగా వాంతులు అవుతుండ‌టం, నీర‌సంగా ఉండ‌టంతో న‌వంబ‌ర్ 12న కాంటినెంట‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్ష‌లు చేయ‌గా, ఆమె సిజేరియ‌న్ మచ్చ (గ‌తంలో ప్ర‌స‌వం స‌మ‌యంలో చేసిన‌ప్పుడు ఏర్ప‌డిన మ‌చ్చ‌) వ‌ద్ద ఒక గ‌డ్డ లాంటిది ఏర్ప‌డిన‌ట్లు తెలిసింది. దాన్ని బ‌ట్టి చూస్తే, ఆ మ‌హిళ‌కు గ‌ర్భం ఉండాల్సిన ప్ర‌దేశంలో కాకుండా వేరేచోట వ‌చ్చింద‌ని, దానివ‌ల్ల గ‌ర్భాశ‌యం చిరిగిపోయి చివ‌ర‌కు బాధితురాలు మ‌ర‌ణించే ప్ర‌మాదం కూడా ఉంద‌ని వైద్యులు గుర్తించారు.

ఈ ప‌రిస్థితి గురించి, ఆమెకు అందించిన చికిత్స గురించి కాంటినెంట‌ల్ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్ జ్యోతి కంక‌ణాల మాట్లాడారు. “ఇలాంటి ప‌రిస్థితులు చాలా అరుదు. గ‌తంలో సిజేరియ‌న్ శ‌స్త్రచికిత్స చేయించుకున్న‌వాళ్ల‌కే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఈ ప‌రిస్థితి సంక్లిష్ట‌త దృష్ట్యా ప‌లు విభాగాల‌కు చెందిన వైద్యులు చికిత్స చేయాల్సి వ‌చ్చింది. ముందుగా గ‌ర్భాశ‌య ర‌క్త‌నాళాల‌కు ఎంబోలైజేష‌న్ చేశారు. ఇది కేవ‌లం 4 గంట‌ల్లోనే పూర్త‌యింది. 36 గంట‌ల త‌ర్వాత లాప్రోస్కొపీ ప‌ద్ధ‌తిలో గ‌ర్భాశ‌యాన్ని ఖాళీ చేసి, సాధార‌ణ ప‌రిస్థితికి తెచ్చాం” అని ఆమె వివ‌రించారు.

“ఇలాంటి సంక్లిష్ట‌మైన కేసుల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు గ‌ర్భాశ‌యాన్ని తీసేసి, మ‌ళ్లీ దాన్ని పున‌రుద్ధ‌రిస్తాం; అప్పుడు భ‌విష్య‌త్తులో వాళ్లు మ‌ళ్లీ గ‌ర్భం దాల్చే అవ‌కాశం ఉంటుంది. రేడియాల‌జీ, అన‌స్థీషియా లాంటి ఇత‌ర విభాగాల్లో నిపుణులు కూడా త‌మ‌వంతు సాయం అందించ‌డం వ‌ల్ల‌నే మా గైన‌కాల‌జీ బృందం ఈ విజ‌యం సాధించ‌గ‌లిగింది” అని డాక్ట‌ర్ జ్యోతి తెలిపారు.

రోగిని 5 రోజుల త‌ర్వాత ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి చేసినా, ఆమె ప్రాణాలు కాపాడేందుకు క‌ష్ట‌ప‌డిన నిపుణుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిరంత‌రం ప‌రిశీలిస్తూనే ఉంది. చికిత్స అనంత‌రం రెండు ర‌కాల ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత‌, ఇప్పుడు పూర్తిగా సాధార‌ణ స్థితికి చేరుకున్నార‌ని చెప్ప‌గ‌లుగుతున్నారు. ఇప్పుడు కావాల‌నుకుంటే ఆమె మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌చ్చు కూడా.

కాంటినెంటల్ ఆసుపత్రుల గురించి:
కాంటినెంటల్ ఆసుపత్రులు హైదరాబాదులో ఎన్ఏబీహెచ్, జేసీఐ గుర్తింపు కలిగిన ఆసుపత్రి. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ టెర్షియరీ మరియు క్వాటెనరీ వైద్య సదుపాయాలు లభిస్తాయి. ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 750 బెడ్‌లు, 250 ఆపరేషనల్ బెడ్‌లు ఉన్నాయి. ఆసుపత్రిలో గ్రీన్ ఓటీ, మూడో స్థాయి ఎన్ఐసీయూ, పీఐసీయూ ఉన్నాయి. వీరి క్రిటికల్ కేర్ బృందం ఎంతో సమర్థవంతమైనది. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు, వైద్య పరికరాలు, సరికొత్త కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయి. ఆసుపత్రిలోని ప్రధాన విభాగాల్లో కార్డియాక్ సైన్సెస్, న్యూరో సైన్సెస్, గాస్ట్రో ఎంటరాలజీ, ఆబ్స్టెట్రిక్స్ మరియు గైనకాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్స్, అత్యవసర వైద్యం లాంటివి ఉన్నాయి.