పకృతిని ఆస్వాదించాలంటే పర్వతాలను కాపాడుకోవాలి : కాట్రగడ్డ
పకృతిని ఆస్వాధించాలంటే… పల్లెకు వెళ్లాలి లేదా పర్వతాలు ఎక్కాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పర్వతాల అందాలను ఆస్వాదించాలంటే అక్కడి వెళ్లి తీరాల్సిందే. అప్పుడు ఆ పర్వతం యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో… దేశంలో ఎత్తైన పర్వాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు మానవ జాతి. కాలుష్యంతో అందమైన పర్వతాలను కనుమరుగయ్యేలా చేస్తున్నారు. దేశానికే పేరుగడించిన హియలయ పర్వతాలు మొదలుకొని, వింద్య, ఆరవళి పర్వాలు రానున్న రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాదంలో పడనున్నాయి.
ఇటీవల కాలంలో దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల కాలుష్యం లేకపోవడం వల్ల వందల కిలోమీటర్ల వరకు హిమలయ పర్వతాలు కనిపించాయి. అంతటి అందమైన పర్వతాలు కాలుష్యంతో కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పటికైన పర్వతాలు అధిరోవహించే వారు కాలుష్య ప్రమదానికి గురికాకుండా కాపాడవల్సిన అవశ్యకత ఉంది. మరోవైపు మైనింగ్ పేరుతో ఎత్తైన గుట్టలను, పర్వతాలను కొల్లగొడుతున్నారు వ్యాపార వేత్తలు.. భవిష్యత్తు పిల్లలకు మంచి పకృతి అందించాలంటే వీటిని కాపాడుకోవాలి తప్పకుండా. అంతేకానీ డబ్బుల వేటలో అధికారులు ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలను అనుమతులు ఇవ్వకుండా చూడాలి. రాజకీయ ఒత్తిల్లకు లొంగకుండా ఉండాలి.
అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా …