ఖతాబుక్ వారి “Pagarkhata” యాప్ ఇకపై వ్యాపారులు తమ సిబ్బంది హాజరు మరియు వేతనాలను ఫోన్ నుండే మ్యానేజ్ చేయడానికి సహాయపడనుంది

ప్రస్తుతం ఈ మొబైల్ యాప్ వ్యాపారులకు అనేక విధాలుగా తమ ఉద్యోగుల విషయాలను మ్యానేజ్ చేయడానికి 13 భాషలలో లభ్యమవుతుంది
హైదరాబాద్, డిసెంబర్ 2020: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్-టెక్ సంస్థ, ఖతాబుక్, మరొక క్రొత్త యాప్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వ్యాపారులు తమ ఉద్యోగుల లెక్కలు, హాజరు, వేతనాలు, పనిసామర్ధ్యం, మొదలగు వివరాలను తమ ఫోన్ సహాయంతో డిజిటల్‌గా మ్యానేజ్ చేయగలుగుతారు.
Pagarkhata యాప్, దేశమంతటా వినియోగదారులు సులభంగా ఉపయోగించడానికి వీలుగా 13 భారతీయ భాషలలో లభ్యం అవుతుంది. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ పరికరాలకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్(iOS) పరికరాలకు కూడా రిలీజ్ చేయబడుతుంది. ఉద్యోగుల వేతన మ్యానేజ్మెంట్, మరియు హాజరును ట్రాక్ చేసే సదుపాయం ఉన్న Pagarkhata అప్లికేషన్, ఖతాబుక్ యాప్ యొక్క ప్రధాన బలమైన ఆర్థిక నిర్వహణ సామర్ధ్యానికి అదనపు బలాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఖతాబుక్ యాప్ యూజర్ల నుండి Pagarkhata యాప్ అద్భుతమైన ఆర్గానిక్ ఆదరణను పొందుకుంటుంది.
Pagarkhata యాప్ సహాయంతో, వ్యాపారులు తమ ఉద్యోగుల రికార్డులను నిర్వహించడంలో సమయం ఆదా కావడమే కాకుండా, పనివారికి వేతనాల చెల్లింపు విధానాన్ని వేగవంతం చేసి, లెక్కల సమయంలో మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా, సిబ్బంది నిర్వహణను మరింత మెరుగుపరచి, డిజిటల్ మార్గాలలో జీతాలు చెల్లించడానికి ఉపయోగపడగలదు. భారతదేశ చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాల రోజువారి కార్యకలాపాలను మెరుగుపరచి, ఉత్పాదకాన్ని పెంపొందించడం ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.

అప్లికేషన్ యొక్క లాంచ్ విషయమై రవీష్ నరేష్, కో-ఫౌండర్ మరియు CEO – ఖతాబుక్, మాట్లాడుతూ, “భారతీయ చిన్న మరియు మధ్య స్థాయి వ్యాపారాలకు డిజిటల్ సామర్ధ్యాన్ని పెంపొందించాలనే మా లక్ష్యంలో Pagarkhata ఒక మైలురాయి. డిజిటల్ ప్రపంచంలో ఈ ఉద్యోగుల మ్యానేజ్మెంట్ ప్లాట్ఫాంలు సర్వసాధారణం. కానీ ఆ సౌకర్యం ఇప్పటివరకు కేవలం పెద్ద వ్యాపారాలు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం అవే డిజిటల్ ఉత్పత్తుల సహాయం ఇప్పుడు కిరాణా వ్యాపారులు, సలూన్లు, ఎలెక్ట్రిక్ షాపుల యజమానులకు కూడా, తమ సిబ్బందిని సక్రమంగా మ్యానేజ్ చేయడానికి చాలా అవసరం. మా Pagarkhata యాప్ ఏంఎస్ఏంఈ రంగంలో ఉన్న వర్క్‌ఫోర్స్ మ్యానేజ్మెంట్ విషయంలో వ్యాపారులకు ఎంతగానో సహాయపడుతుంది. వాడటానికి సులభంగా, మొబైలుఫోను అనుభవాన్ని ద్రుష్టిలో పెట్టుకొని చేయబడ్డ ఈ అప్లికేషన్ ఈ విభాగంలో ఉన్న వ్యాపారులకు అన్ని విధాలా సహాయపడుతుంది” అని అన్నారు.

Pagarkhata యాప్ ఉపయోగించడం చాలా సులభం
అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
వ్యక్తిగత మరియు వ్యాపార సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి
మీ స్టాఫ్/ఉద్యోగస్తుల వివరాలను ఎంటర్ చేసి ఆపై ఫోన్ నుండే సిబ్బందిని మ్యానేజ్ చేయడం ప్రారంభించవచ్చు