అమెరికా ఎన్నికల్లో గెలిచిన భారతీయులు
అమెరికా ఎన్నికల్లో భారతీయులకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ దేశ దిగువ సభ (లోయర్ హౌస్) అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు నలుగురు ఇండియన్ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. మొదటి సారి బరిలో నిలిచినోళ్లు కొందరు ఓడిపోయారు. ఎక్కువగా డెమొక్రాట్ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నేతలు చేసిన ‘సమోసా కాకస్’ ప్రచారం బాగానే పనిచేసింది. డాక్టర్ ఎమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు మంచి మెజారిటీతో విజయం సాధించారు. మరొక ఇండియన్ డాక్టర్ హిరాల్ తిపిర్నేని లీడింగ్‌లో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండియన్ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఇండియన్ అమెరికన్ ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా మారారు.లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ (30)ను రాజా కృష్ణమూర్తి ఓడించారు. 47 ఏళ్ల ఆయనకు 71 శాతం ఓట్లు పోలయ్యాయి.