అమెరిక‌న్ ఆంకాల‌జీ హాస్పిట‌ల్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం

క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అవలంభిస్తున్న అత్యాధునిక విధానాలకు గుర్తింపుగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ అయిన ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డును ఏవోఐకి అందజేసింది.
తన 16 అత్యాధునిక ఆసుపత్రుల ద్వారా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతం, జమ్మూ, శ్రీలంకలలో వైద్య సేవలను అందిస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ అచిరకాలంలోనే అగ్రశ్రేణి క్యాన్సర్ చికిత్స సంస్థగా గుర్తింపు సాధించింది. నాణ్యమైన చికిత్సా విధానం, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, కచ్చితమైన చికిత్సతో ప్రాథమిక దశలో క్యాన్సర్ వ్యాధిని నయం చేయడం, అత్యున్నత సేవా ప్రమాణాలను పాటించడం ద్వారా దక్షిణాసియాలో నమ్మకమైన వైద్య సంస్థగా ఏవోఐ ఎదిగింది. అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ, అనితర సాధ్యమైన ఆర్థిక వృద్ధితో దూసుకెళుతున్న అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ క్యాన్సర్ వ్యాధిపై జరుగుతున్న పోరాటంలో అగ్రగామిగా నిలుస్తోంది. కచ్చితమైన చికిత్సా ప్రమాణాలను పాటిస్తున్న ఏవోఐ.. పూర్తి పారదర్శకతతో రోగులకు నమ్మకమైన సేవలందిస్తోంది. వివిధ దేశాల్లోని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులతో ఏర్పాటైన అంతర్జాతీయ స్థాయి ట్యూమర్ బోర్డు సమీక్ష ద్వారా క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ చికిత్సలను అందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ సంరక్షణ అందించడమే లక్ష్యంగా సేవలందిస్తున్న ఏవోఐ నందు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, హెమటాలజీ ఆంకాలజీ విభాగాలతో పాటు అత్యుత్తమ క్యాన్సర్ నిర్ధారణ విధానాలైన పెట్ సీటీ, ఎస్పీఈసీటీ, సీటీ, రియల్ టైమ్ ట్యూమర్ ట్రాకింగ్, హిస్టో ప్యాథాలజీ, మాలిక్యులర్ ప్యాథాలజీ, కైటోజెనిటిక్స్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఏవోఐలోని పటిష్టమైన ఐటీ వ్యవస్థ ద్వారా చికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రపరుస్తారు.
క్యాన్సర్ చికిత్సా రంగంలో అగ్రగామిగా నిలిచిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ కు ప్రతిష్టాత్మకమైన ఫ్రాస్ట్ అండ్ సలివాన్ అవార్డు లభించడం పట్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్వీస్ ఇంటర్నేషనల్ గ్రూప్ దక్షిణాసియా విభాగం సీఈవో డాక్టర్ జగ్ప్రాగ్ సింగ్ గుజ్రాల్ హర్షం వ్యక్తంచేశారు. ఈ పురస్కారాన్ని ఏవోఐకి చెందిన 2500 మంది సిబ్బందికి అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తమ సంస్థపై అపారమైన నమ్మకంతో మద్దతునిచ్చిన పేషేంట్లకు, ఏవోఐ ప్రస్థానంలో అడుగడుగునా తోడుగా ఉన్న భాగస్వామ్య సంస్థలకు, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ బృందానికి ఈ సందర్భంగా డాక్టర్ జగ్ప్రాగ్ సింగ్ గుజ్రాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.