అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఈ రోజే
ట్రంప్ భవిష్యత్తు కూడా ప్రజలు ఇవాళే చెప్పనున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఓ యుద్ధంలాంటి వాతవారణమే ఉన్నదని చెప్పోచ్చు. ఓ వైపు కరోనాతో పోరాడుతూనే ఎన్నికల ప్రచారం చేశారు. ఈ అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఇప్పటికే 9.3కోట్ల మంది అమెరికన్లు ముందస్తుగా ఓట్లు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు మిగతావారు భౌతికంగా పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లి ఓటేయనున్నారు. నేరుగా ఓటేయడానికి వీలులేని వారు మెయిల్ బ్యాలెట్‌ను ఆశ్రయిస్తారు. ఈ సారి కరోనా కారణంగా చాలా మంది పౌరులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా మెయిల్ బ్యాలెట్ పద్ధతినే అనుసరించారు. అమెరికాలో 24 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. స్వింగ్ స్టేట్స్‌గా భావిస్తున్న సుమారు 16 రాష్ట్రాల్లో 5.87కోట్ల మంది పౌరులు ఇప్పటికే ఓటేశారు. ఈ రాష్ట్రాలే అధ్యక్ష రేసును రసవత్తరంగా మార్చే అవకాశమున్నది.