మెదక్ జిల్లాను టార్గెట్ చేసిన భాజపా
తెలంగాణలో మెదక్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది రాజకీనాయకులు ఈ జిల్లా నుంచే వచ్చారు. ఈ మెదక్ నుండి గెలుపొంది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలూ ఉన్నారు. ఓ ఇందిరాగాంధీ, టైగర్ నరేంద్ర, విజయశాంతి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఈ జిల్లాకు చెందినవాడే. అయితే ఇప్పుడు మోడీ, అమిత్‌షా కన్ను మెదక్ జిల్లాపై పడింది. ఈ జిల్లా నుంచే భారతీయ జనతా పార్టీ కమలం వికసించాలని వ్యుహాలు రచిస్తున్నారు.
మెదక్ జిల్లా ఎందుకు టార్గెట్ చేశారు ?
తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పట్టు సాధించిన బీజేపీ ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అడుగులు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సీఎం సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు జరుగుతున్న పరిణామాలో నిదర్శనం. అయితే ఒక్క దుబ్బాకతో కాకుండా ఉమ్మడి మెదక్‌లో పాగ వేయాలని కమలం నేతలు ఆలోచిస్తున్నారు. ఇందుకు మోడీ ఆదేశాల మేరకు అమిత్ షా వ్యుహాలు రచిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్తగా ఉన్న విజయశాంతి గత కొన్ని రోజులుగా ఉత్తమ్ పెత్తనం నచ్చడం లేదని బాహాటంగానే వ్యక్త పరుస్తోంది. దుబ్బాక ఎన్నికలను కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్టార్ క్యాంపెయనర్‌గా ఉన్న విజయశాంతి ఎక్కడా కూడా ప్రచారంలో పాల్గొనలేదు. ఈ తరుణంలోనే దసర పండగ రోజు విజయశాంతి ఇంటికి వెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆమెతో పార్టీ మార్పు విషయంపై చర్చిచినట్లు సమాచారం. ఒక వేళా విజయశాంతి సొంతగూటికి చేరుకుంటే మెదక్ జిల్లాలో పార్టీకి మరింత బలం పెరుగుతందనే యోచనలో ఉన్నారు కమలం నేతలు.
మరో వైపు ఉమ్మడి మెదక్‌లోని ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్ ఉన్నారు. ఇక నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి ఇటీవల తెరాస తీర్ధం తీసుకున్న సునీత రెడ్డిని విజయశాంతి ద్వారా భాజపా లోకి తీసువస్తారనే వార్త వినిపిస్తోంది. నర్సాపూర్ నుండి సునిత రెడ్డికి తెరాసలో టికెట్ ఇవ్వడం కష్టమైన పని అంటున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయశాంతిని మెదక్ నుంచి పోటీలో తీసుకవచ్చి అధికారంలోకి వస్తే పెద్ద పదవి ఇచ్చే అవకాశం ఉందటున్నారు రాజకీయ విశ్లేశకులు.
ఇదిలాఉంటే కాంగ్రెస్ నుంచి విజయశాంతిని చేజారినియ్యకుండా ఉండేందుకు హస్తినా నుంచి సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. అయితే ఉత్తమ్ మీద అలక మీద ఉన్న విజయశాంతి.. పార్టీకి కొన్ని షరుతులు పెట్టినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఒకవేళ అలా జరగకుంటే విజయశాంతి పార్టీ మారిన తరువాత మంచి ముహుర్తం చూసి రేవంత్ రెడ్డిని కూడా కమలం గూటికి చేరుస్తారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఏదైమైన మెదక్ జిల్లాను బీజేపీ నేతలు టార్గెట్ చేయడం తెరాస నేతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే అమిత్ షా వేసిన ఈవ్యుహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.