లావైన పొట్టతో ఇబ్బందిగా ఉందా అయితే వీటిని దూరం పెట్టండి : స‌్రవంతి
సాధారణంగా ప్రతి ఒక్కరూ స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. యువతలో అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. అందుకే పొట్ట తగ్గించుకోవడం కోసం రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అంటూ ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఎంత చేసినా పొట్ట తగ్గడం లేదంటూ నిరాశ చెందుతుంటారు. వాస్తవానికి పొట్ట తగ్గించుకోవాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు. వ్యాయామంతోపాటు కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఆహార పదార్ధాలలో మార్పు చేయాలంటున్నారు డాక్టర్ స్రవంతి. అవే ఏంటో తెలుసుకుందాం.
- ఫాస్ట్ ఫుడ్: ఫాస్ట్ ఫుడ్ అనే మాట వింటే చాలు ఎవరికైనా నోరూరుతుంది. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్‌కు ఊబకాయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఫాస్ట్‌ఫుడ్ తింటే పొట్ట పెరుగుతుంది. అందువల్ల పొట్ట తగ్గాలంటే ఫాస్ట్‌ఫుడ్‌ను పక్కన పెట్టాల్సిందే.
- చక్కెర: నోటికి తియ్యగా ఉండే ఈ పదార్థం మన శరీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తుంది. ఒక కప్పు చక్కెరలో 773 క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం రావడమే కాకుండా మధుమేహం వంటి ఇతర రోగాలు కూడా అంటుకుంటాయి. కాబట్టి చక్కెరను కూడా దూరం పెట్టాల్సిందే.
- ఆలుగడ్డ: అందరికి బాగా నచ్చే కూరగాయ ఈ ఆలుగడ్డ. కానీ ఊబకాయులకు ఈ ఆలుగడ్డ మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఒక ఎగ్ సైజు ఆలుగడ్డలో 163 క్యాలరీలు ఉంటాయట. ఈ క్యాలరీలు పొట్ట పెరుగడానికి కారణం అవుతాయట.
- కూల్‌డ్రింక్స్: కూల్‌డ్రింక్స్ కూడా ఊబకాయం, లావు పొట్టకు కారణమవుతాయి. 12 ఔన్సుల డ్రింక్‌లో దాదాపు 140 క్యాలరీస్ ఉంటాయి. అందువల్ల నాజూకు పొట్ట కోరుకునే వాళ్లు కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచింది.
- మరికొన్ని పదార్థాలు: పైన పేర్కొన్న వాటితోపాటు బేకరీ ఫుడ్స్, వేపుళ్లు, స్వీట్‌లు, చాక్‌లెట్‌లు, అన్ని రకాల దుంపలు కూడా ఊబకాయానికి, లావు పొట్టకు కారణం అవుతాయి. అందువల్ల వాటిని కూడా దూరం పెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.