రఘునందన్ అంటే టీఆర్ఎస్ అంత భయం ఎందుకు?
దుబ్బాక ఉప ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీల మధ్య పోరు తీవ్ర స్థాయి చేరింది. ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న కొద్ది మాటల దాడి పెరుగుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ ప్రజల ముందుంచుతుంటే .. టీఆర్ఎస్ సైతం బీజేపీపై విరుచుకు పడుతోంది. నియోజక వర్గంలో ఓ వైపు విపక్ష పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ మంత్రి హరీష్ రావ్ దూసుకు పోతున్నారు.తమ అభ్యర్థి గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే ఇరు పార్టీల నేతలు ప్రచార పర్యం మొదలు పెట్టారు. ప్రస్తుతం నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ రెండు పార్టీలు ఏమాత్రం తగ్గుకుండా ఢీ అంటే ఢీ అంటున్నాయి.
ఇక టీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా కార్యక్రమాలు చేపడుతోంది. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను తన పార్టీలో చేర్చుకుంటూ తమకు ఎవరు ఎదురులేరు అంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ఓ టోల్ గేట్ వద్ద బీజేపీ అభ్యర్థి ఫ్రెండ్స్ కారులో లక్షల రూపాయలు దొరకాయని పోలీసులు వెల్లడించడంతో , పాటు రఘునందర్ రావుపై గతంలో లైంగిక వేదింపుల కేసును పెట్టిన యువతి సైతం ఆయన ఓడిపోయేందుకు తన వంతు పాత్ర పోషిస్తా అంటూ ప్రకటించింది.
దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు ఎదురుగాలి ఖాయం అని భావించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాలేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకు పోతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు తయారైంది దుబ్బాక ఉప ఎన్నికల వ్యవహారం. ఇప్పటి వరకు దుబ్బాకలో టీఆర్ఎస్ ముఖ్యనేతలెవరూ ప్రచారాని వెళ్ళలేదు. మొత్తం ఆర్థిక మంత్రి హరీష్ రావే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా జరగిన ఘటన ఇరుపార్టీల మధ్య పోరును రెట్టింపు చేసింది.
రఘునందర్ రావ్ బందువుల ఇల్లలో పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. డబ్బులు ఉన్నాయన్నపక్కా సమాచారంతో ఒక్కసారిగా వారి ఇంటిపై దాడులు నిర్వహించారు పోలీసులు. దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతంటే సిద్దిపేటలో అబ్యర్థి బంధువుల ఇంట్లో దాడులేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులలోపోటీసుల అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకే బందుల ఇల్లల్లో డబ్బులు దాచారని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.
ఎలాంటి నోటీసులు లేకుండా ఒకరి ఇళ్లలోకి చొరబడి రైడ్స్ నిర్వహించే హక్కు పోటీసులకు లేదని.. ఇక కోవిడ్ నిబంధనలు అమలవుతున్న వేళ ఇలా ఇళ్లలోకి వచ్చిన ఇంట్లో వారిపై దాడులకు తెగబడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు . మరోవైపు రఘునందన్ రావు బంధువు ఇంటి ముందు పోలీసు డబ్బుల బ్యాగ్ తో ప్రత్యక్షం అవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటున్నారు బీజేపీ నేతలు.
డబ్బుసంచితో ఉన్న పోలీసును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం తో పాటు సంచిలో ఉన్న డబ్బులను బయటకు తీసి మీడియా ముందుచారు.అయితే ఈ డబ్బులు ఎక్కడవి … రఘునందన్ రావ్ ఇంట్లోనే దొరికాయా లేక పోలీసులే ఇలా బీజేపీ ని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు.
మొత్తానికి దుబ్బాక ఎన్నికల్లో పార్టీల మధ్య పోరు తీవ్రం కావడం.. పోలీసుల దాడుల వరకు వెళ్ళడంతో ఆ నియోజక వర్గ ప్రజలు టీఆర్ఎస్ నేతల మాటలు నమ్ముతారో బీజేపీ మాటలకే జై కొడతారో చూడాలి. గెలుపు ఎవరిదైనా బొటాబొటీ మెజారిటీ తప్పా పెద్దగా మెజారిటీ రాదంటున్నారు విశ్లేషకులు.