Khatabook వారి ‘MyStore’ యాప్ వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని 15 సెకన్లలో ఆన్‌లైన్‌లో తెరవడానికి సహాయపడుతుంది.
కేవలం నెల రోజులలో దాదాపు 25 లక్షలకు పైగా వ్యాపారులు ‘MyStore’ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు
భారతదేశంలో అతి వేగంగా ఎదుగుతున్న ఫిన్‌టెక్ సంస్థైన Khatabook, ‘MyStore’ అనే మరొక యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రచురించి తమ వ్యాపార పయనంలో మరొక మైలురాయిని చేరుకుంది. ఈ అప్లికేషన్ యొక్క సులువైన మరియు సురక్షితమైన ఇంటర్‌ఫేస్ కారణంగా ఎవరైనా సరే, ఈజీగా ఉపయోగించగలరు – తద్వారా వ్యాపారాలు కేవలం 15 సెకన్లలో వారి ఆన్‌లైన్ వ్యాపారాన్ని తెరచి బిజినెస్ చేయవచ్చు.
ప్రస్తుతం Khatabook వారి ‘MyStore’ యాప్ దేశమంతటా ఉన్న వ్యాపారుల సౌలభ్యానికి గాను 13 భారతీయ భాషలలో లభ్యమవుతుంది. ఈ అప్లికేషన్ సహాయంతో, వ్యాపారులు భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోకుండా వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు. ఇప్పటికే, ‘MyStore’ యాప్‌ను దేశంలో 25 లక్షల వ్యాపారులు ఇన్‌స్టాల్ చేసుకొని వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. Khatabook వారి అంచనా ప్రకారం, ఈ యాప్ వారి ప్రధాన అప్లికేషన్ నుండి మూడవ వంతు యూజర్లను ఆకర్షించగలుగుతుంది.
అప్లికేషన్ యొక్క లాంచ్ పై, రవీష్ నరేష్, కో-ఫౌండర్ మరియు CEO – Khatabook, మాట్లాడుతూ, “భారతదేశంలో చిన్న మరియు మధ్యస్థాయి వ్యాపారులకు మరింత సామర్ధ్యాన్ని అందించి, వారి వ్యాపార కార్యకలాపాలకు వెచ్చించే ఖర్చును తగ్గించేందుకు వివిధ మార్గాలను నిరంతరం వెతుకుతున్నాము. ‘MyStore’ లాంచ్‌తో ఈ డిజిటల్ కాలంలో, మేము ఇంత వరకు అందిస్తున్న సర్వీసులను ఆధారం చేసుకొని, వ్యాపారాలను నడిపించేందుకు మరిన్ని అత్యాధునిక టెక్నాలజీ ఆధారిత వెసులుబాట్లను అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు, కరోనా మహమ్మారి కారణంగా పెనుమార్పులు చోటుచేసుకున్న వ్యవస్థలో, ఇకపై వారి వ్యాపారాలను కొనసాగించడానికి అవసరమయ్యే సాధనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రజల నుండి ‘MyStore’ యాప్‌కు దక్కిన ఆధరణను బట్టి డిజిటల్ ఉనికిని పొందాలనుకునే ప్రతీ వ్యాపారానికి ఇదే సరైన సమయమని చెప్పగలము’ అన్నారు.