48 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం
48 కోట్ల 45 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో బల్దియా కౌన్సిల్ సమావేశం నగర మేయర్ డాక్టర్ గుండా ప్రకాశ రావు అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన 52 ఏజెండా అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన మాజీ కార్పొరేటర్లు కొప్పుల శ్రీనివాస్, రోకుల భాస్కర్ లకు కౌన్సిల్ సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించింది, ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో హైదరాబాద్ నగరాన్ని దృష్టిలో ఉంచుకుని జిహెచ్ఎంసి కి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్లు 2 దఫాలుగా వర్తించే విధంగా మరియు మహిళలకు సీట్లు 50 % రిజర్వేషన్ కేటాయించడం హర్షణీయమని,అట్టి చట్టసవరణకు ఈనెల 13 అసెంబ్లీ,14 న మండలి ఆమోదం పొందడం జరిగిందన్నారు. ఎల్.ఆర్.ఎస్. కు సంబంధించి 2013 సం.లో 29 656 అప్లికేషన్లు వచ్చాయని, 300 కోట్ల ఆదాయం కుడా కు సమకూరిందని,7 సం. తర్వాత ప్రస్తుతం ఎల్.ఆర్.ఎస్.కు 70 257 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇప్పటికి7 కోట్ల 30 లక్షల నిధులు బల్దియాకు సమకూరాయని,ఈ సారి 600 -700 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని,పురపాలక శాఖ మంత్రి కే. టి.ఆర్.సూచించినట్లు ఇట్టి ఆదాయం నుండి 70% నిధులను నగర అభివృద్ధి కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల ఎన్టీఆర్ నగర్, అమరావతి నగర్, టీవీ నగర్,చందా నగర్ లో భారీ వర్షాల వల్ల నీరు నిలిచి జనజీవనం స్తంభించిన నేపథ్యంలో తక్షణం స్పందించడం జరిగిందని గత ఆగస్టు మాసంలో వర్షాల వల్ల నగరం వరద ముప్పులో చిక్కుకున్నప్పుడు పురపాలక శాఖ మాత్యులు కేటిఆర్ తో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ నగరం లో క్షేత్రస్థాయిలో పర్యటించి,వరద ముప్పు ఎదుర్కొన్న అన్ని ప్రాంతాలను పర్యటించడం జరిగిందని,నాలా లను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని గ్రహించి కలెక్టర్ అధ్యక్షతన ఇరిగేషన్,పోలీస్, ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం నాలల పైన 384 అక్రమ నిర్మాణాలను గుర్తించడం జరిగిందని ఇప్పటికీ 287 అక్రమ నిర్మాణాలు తొలగించడం జరిగిందని, 84 మంది కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందని, శాసన సభ్యులు పార్లమెంటు సభ్యుల సహకారంతో వీటిపైన సమగ్ర ప్రణాళికలు తయారు చేసి ముందుకెళతామని, ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా అక్రమాలను తొలగిస్తున్నామని స్మార్ట్ సిటీ పథకం లో భాగం గా రూ.50 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందని వాటిని నాలా ల మీద రిటైనింగ్ వాల్స్, ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ముందుకు వెళ్తామని, ఇవే కాకుండా ఇటీవల వరదల నేపథ్యంలో ప్రత్యేకం గా రూ. 25 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశానుసారం నగరంలో 300 మరుగుదొడ్లను నిర్మించనున్నామని ఇందులో మొబైల్ షీ టాయిలెట్ లు,లూ కేఫ్ లు ఉన్నాయని మేయర్ అన్నారు.
6వ డివిజన్ కార్పొరేటర్ చింతల యాదగిరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, జిల్లాలను విభజించడం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారని రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, నాణ్యమైన పరిపాలనను అందించే డానికి కృషి చేస్తున్నారని ఆసరా పెన్షన్ ల తో పాటు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ కి అతివలకు చీరలు అందజేస్తున్నారని, ముస్లింలకు రంజాన్ పండుగ సమయంలో, క్రైస్తవులకు క్రిస్టమస్ సందర్భంగా కూడా వస్త్రాలను అందజేయడం జరుగుతుందని,ధరణి పోర్టల్ ద్వారా ప్రజల ఆస్తులు నిష్పక్షపాతంగా నమోదు చేయబడతాయని,స్వయం గా ముఖ్యమంత్రి తన ప్రాపర్టీ ని పోర్టల్ ద్వారా నమోదు చేయించుకోవడం జరిగింది ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎల్.ఆర్.ఎస్ గడువును మరో 15 రోజులు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు
47 వ డివిజన్ కార్పొరేటర్ నల్లా స్వరూపరాణి రెడ్డి మాట్లాడుతూ జిహెచ్ఎంసి లో నిర్వహించబోయే ఎన్నికలలో మహిళలకు 50 % సీట్ల లలో రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమని, ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో మేయర్,కమిషనర్లు తక్షణం స్పందించారని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన డివిజన్లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి అని తన ఇల్లు కూడా నీటి వరద లో చిక్కుకుందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కార్పొరేటర్ అన్నారు.
14 వ డివిజన్ కార్పొరేటర్ బయ్యా స్వామి మాట్లాడుతూ తన డివిజన్ లోని బతుకమ్మ రోడ్డును పూర్తి చేయాలని గతంలో అనేక ఆటంకాలు ఏర్పడ్డాయని ప్రస్తుతం కాంట్రాక్టర్లు పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పండుగ నేపథ్యంలో బతుకమ్మ విగ్రహాలకి రంగులు వేయించడంతో పాటు లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
మేయర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యం లో పండులకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదన్నారు.
36వ డివిజన్ కార్పొరేటర్ అబూబాకర్ మాట్లాడుతూ నగరంలో నూతనంగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని దివ్యాంగుల అవసరాలను కూడా దృష్టి లో ఉంచుకొని వారికి కూడా ప్రాధాన్యం కల్పించేలా చూడాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి హామీ నిధుల పనులకు సంబంధించి కలెక్టర్ తో సంప్రదించి రీకాల్ అయిన వాటిని గురించి పునరాలోచించాలని అన్నారు.
27 వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్ మాట్లాడుతూ ఆక్రమణలు తొలగించే క్రమంలో మార్కింగ్ ఇవ్వాలని, వివిధ అభివృద్ధి పనులలో వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని 24–27 డివిజన్ల మధ్యలో వెంకటేశ్వర ఆలయం వెనకాల రోడ్డును విస్తరించాలని, పైపు లైన్ పూర్తి అయిందని నల్ల కనెక్షన్స్ ఇవ్వాలని, పోతన ఆడిటోరియం అభివృద్ధికి రూ. 62 లక్షలు కేటాయించారని దీనిని ఓపెన్ థియేటర్ గా మార్చాలని, ఈ ప్రాంతంలో చిత్త తరలింపునకు రెండవ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏర్పాటు చేశారని దీనిని తరలించాలని, ప్రస్తుత కమ్యూనిటీ హాల్ చాలా చిన్నదని అందులో 108 వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని,అట్టి వాహనాలను ఫైర్ స్టేషన్ లో పార్కింగ్ చేసుకునేలా చూడాలని అన్నారు.
18 వ డివిజన్ కార్పొరేటర్ సామంతుల ఉషశ్రీ మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పిదం వల్ల నేడు నగరం ముంపుకు గురి అవుతుందని నా లను ఒకేవైపు మార్కింగ్ చేయడం వల్ల పేదరికం లో ఉండే వారు పూర్తిగా వారి ఆస్తులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఈ సందర్భం ఆమె అన్నారు.
30 వ డివిజన్ కార్పోరేటర్ బోడ డిన్న మాట్లాడుతూ దేశంలో బాలికల పైన అత్యాచారాలు జరగడం శోచనీయమని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగా నేడు అనేక మంది ఐఏఎస్ అధికారులు అయ్యారని ఎంతో మంది మహిళ లకు అనేక రంగాల్లో అవకాశాలు దక్కాయని,రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 50 % రిజర్వేషన్లు తీసుకురావడం జరిగిందని, తన డివిజన్లోని యాదవ నగర్- పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో సుమారు 8200 జనాభా నివాసిస్తున్నారని, కాకతీయ కాలువ నీరు వదిలిన క్రమంలో కనీసం 4-5గురు నీటి ప్రవాహం లో గల్లంతవుతున్నారని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరగా
మేయర్ స్పందిస్తూ హాసన్ పర్తి ప్రాంతం లో కూడా ఇదే తరహా లో పరిస్థితులు ఉన్నాయని ఫెన్సింగ్ నిర్మాణానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి, కార్పొరేటర్లు,కోఆప్షన్ సభ్యులు,వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.