సుప్రీంకోర్టులో తెలంగాణ సచివాలయ బంతి

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పు ఇచ్చింది. రేవంత్‌రెడ్డి పిటిషన్ తిరస్కరించాలని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్‌కు బదిలీ చేస్తూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు.