పుట్టుకతో వచ్చే వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ తిరుపతి
డాక్టర్. తిరుపతి కేదార్
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపూరం.
సెరిబ్రల్ పాల్సీ (సీపీ) అనగా గర్భములో వున్నపుడు కానీ ప్రసవసమయంలో కానీ శిశువు మెదడు పై కలిగే అవాంఛనీయ ఒత్తిడి వలన ఏర్పడే నరాల బలహీనత. ప్రతి వెయ్యి మందిలో సుమారు ఇద్దరు శిశువులు ఈ సమస్య బారిన పడవచ్చు.
మన దేశంలో సెరిబ్రల్ పాల్సీ రావడానికి ముఖ్య కారణాలు
- అతి తక్కువ బరువుతో జన్మించడం.
- నెలలు నిండకముందే జన్మించడం.
- ప్రసవ సమయంలో బిడ్డకు ప్రాణవాయివు సరిగా అందకపోవడం.
లక్షణాలు - బుద్ది మాంద్యం,
- సరిగా మాట్లాడలేకపోవడం,
- సరిగా నడవలేకపోవడం,
- ఫిట్స్ (మూర్ఛా రావడం),
- కాళ్లు, చేతులు కండరాలు బిగుసుకపోవడం
ఈ లక్షణాలు పిల్లలో 18 నుండి 24 నెలల వయసులో బయటపడవచ్చు. సెరిబ్రల్ పాల్సీని పోలిన లక్షణాలతో మరికొన్ని జబ్బులు ఉన్నాయి. అయితే సెరిబ్రల్ పాల్సీని ఇతర జజ్బులనుండి వేరు చేసి నిర్దరించటనికి సమీపములో వున్న మెదడు మరియు నరాల వైద్యనిపుణులు సంప్రదించాలి.ఈ సీపీకి ఆందోళన చెందకండి, సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా శాశ్వత అంగవైకల్యం నివారించవచ్చు. సాధారణంగా ఈ సీపీలో ఏర్పడే కండరాల బిగువుని బోటులినం ఇంజెక్షన్, ఫిజియోథెరఫీ అవసరమైతే శ్రస్తచికిత్స ద్వారా తగ్గగించవచ్చు.
ఫిట్స్, నిద్ర, ఆహార లోపాలు, మానసిక ఇబ్బందులు వంటి సమస్యలును కూడా మందుల ద్వారా నయం చేయవచ్చు. మాట్లాడడంలో ఇబ్బందిగా ఉంటే స్పీచ్ థెరపీ ద్వారా, బుద్ది మాంద్యం ప్రత్యేక పాఠశాలలో చదివించడం ద్వారా నయం చేయవచ్చు.
సెరిబ్రల్ నివారించ గల వ్యాధి కావున తల్లి గర్భందల్చినపుడు సమీపములో ఉన్న ఆసుపత్రిలో పేరు నమోదు చేయించుకొని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యులు సూచించిన మందులు వాడుతూ సరైన పౌష్టకాహారం తీసుకోవడం, మరియు ప్రసవం కచ్చితంగా ఆసుపత్రిలో జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. ఏటా ఆక్టోబర్-6న ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ డే పాటిస్తారు. ఈ సంవత్సరం MAKE YOUR MARK అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.