ట్రంప్‌కి కరోనా – అయోమంలో అమెరికా
ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. వారి సహాయకుల్లో ఒకరికి కొవిడ్ వచ్చిన తర్వాత.. ముందు జాగ్రత్తగా ట్రంప్ దంపతులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరికీ కూడా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో ట్రంప్ దంపతులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయన సలహాదారు హాప్ హిక్స్ కు తొలుత కరోనా సోకింది. ఆయన నిరంతరం విధుల్లో ఉంటున్నందున కొవిడ్ పాజిటివ్ వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనద్వారా ట్రంప్ దంపతులకు కూడా సోకినట్లు అనుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ ఇద్దరూ పాజిటివ్ గా తేలింది.
నెలలోనే భవిష్యత్తు తేలేది
ట్రంప్ భవిష్యత్తు మరో నెలరోజుల్లో తేలనుంది. నవంబరులో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఇటీవలే బైడెన్ తో చర్చా కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అది ముగిసిన తర్వాత.. నేనే గెలిచాను అని ఆయన ప్రకటించుకున్నారు. అయితే నెలరోజుల వ్యవధిలోనే ఎన్నికలు ఉండగా.. ఆయనకు కొవిడ్ రావడం.. ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లడం అంటే కనీసం రెండు వారాలపాటు ఎవ్వరికీ అందుబాటులో ఉండరని.. అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ట్రంప్ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని కూడా అనుకుంటున్నారు.