ఖాతాదారలకు లీజింగ్ ఫెసిలిటీని మరింత సులభతరం చేయడానికి OTO క్యాపిటల్‌తో భాగస్వామ్యం నెరుపుతున్న ఒకినోవా
స్వంత ఎలక్ట్రానిక్ ద్వి చక్రవాహనాలను స్వంత చేసుకోవడానికి సరళమైన లీజింగ్ ఆప్షన్‌లను ఖాతాదారులకు అందించడానికి ఒకినోవా- భారతదేశపు ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ వోటివో క్యాపిటల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. లీజింగ్ కాలం12 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. ఈ సదుపాయం బెంగళూరు మరియు పూణేలో ఉన్న ఒకినోవా డీలర్‌షిప్‌ల ద్వారా లభ్యమవుతుంది, రాబోయే నెలల్లో ఇది భారతదేశం అంతటా విస్తరించబడుతుంది. ఒకినోవా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారం ద్వారా వారి వాహనాలను బుక్ చేసే ఖాతాదాదారుల కొరకు ఇది ప్రయోజనం కలిగిస్తుంది, వారు తన ఇంటి వద్ద నుంచే ఈ సరళమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌ని తేలికగా ఉపయోగించుకోవచ్చు.
ఈ భాగస్వామ్యం ద్వారా, కొనుగోలుదారులు ఒకినోవా వేహికల్‌ని కనీసం 12 నెలలపాటు లీజ్‌కు తీసుకోవచ్చు దీని తరువాత విభిన్న స్టైల్ మరియు మేక్‌కు సంబంధించిన ఇతర మోడల్స్‌తో అప్‌గ్రే్డ్ చేసుకునే అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ భాగస్వామ్యం ద్వారా ఇతర ఫైనాన్సింగ్ ఆప్షన్‌లతో పోలిస్తే OTO ఓనర్‌షిప్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లు చెల్లించడం ద్వారా ప్రతినెలా 30 శాతం వరకు పొదుపు చేయవచ్చు. ఉదాహరణకు, సంప్రదాయ బ్యాంకు లోను ద్వారా 2 సంవత్సరాలకు ఒకినోవా ప్రైజ్ ప్రోకు ప్రతినెలా రూ. 3960 ఖరీదు అవుతుంది, అయితే OTP ఫైనాన్సింగ్ ద్వారా, కొనుగోలుదారులు కేవలం నెలకు రూ. 2950- మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది, ఇది ఎంతో ఖర్చు తక్కువ పరిష్కారం.
“లాక్‌డౌన్ సడలించిన తరువాత డిమాండ్ పెరిగినట్లుగా ఒకినోవా గమనించింది. కొవిడ్19 ప్రబలిన తరువాత, ప్రజలు ప్రజా రవాణాని పరిహరిస్తున్నారు మరియు వ్యక్తిగత వాహనాలను ఎంచుకుంటున్నారు. దీని ఫలితంగా ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకం పెరిగింది. ఎలక్ట్రానిక్ వేహికల్స్‌ని ఖాతాదారులకు చౌకగా మార్చడం కొరకు ప్రభుత్వం కొత్త పాలసీలను కూడా ప్రవేశపెట్టింది. OTO క్యాపిటల్‌తో ఒకినోవా ఒప్పందం కుదుర్చుకోవడం కూడా దీనిలోని భాగమే. ఇండస్ట్రీ దిగ్గజాలతో కలిసి పనిచేయాలనే ఆలోచన మరియు ఈ మొబైల్‌ని పెంచాలనేదే ప్రభుత్వం ఆశయం అని శ్రీ. జితేందర్ శర్మ- ఎమ్‌డి మరియు ఫౌండర్, ఒకినోవా పేర్కొన్నారు.
ఒప్పందానికి సంబంధించి, సుమిత్ చహార్డ్- కోఫౌండర్, OTO క్యాపిటల్ మాట్లాడుతూ, “ఒకినోవాని మా పార్టనర్‌గా ఆన్‌బోర్డ్ చేయడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఈవి మార్కెట్ వేగంగా మారుతోంది. తమ మొదటి వాహనం కొనుగోలు చేయాలనే యువత, అతి తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ వాహనం కొనుగోలు చేయాలనే భావిస్తోంది. మా ఫైనాన్సింగ్ ఈవిని స్వంతం చేసుకునే ఖర్చుని గణనీయంగా తగ్గిస్తుంది తద్వారా ప్రజలు తక్కువ చెల్లించడం అలానే నెలవారీ ఈఎమ్ఐలపై తక్కువ చెల్లిస్తారు. ఆటో ఇండస్ట్రీ మాంద్యం నుంచి బయటపడుతోంది మరియు పండుగల సీజన్ మరియు ఆన్‌లైన్ కొనుగోలు మరింత మంది ఖాతాదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం.
లాక్‌డౌన్ సరళించిన తరువాత, ఒకినోవా తనకార్యకలాపాలను ప్రారంభించింది మరియు, కేవలం 25శాతం డీలర్‌షిప్‌లు తెరిచినప్పటికీ నెలలోపు 1000 యూనిట్‌లు విక్రయించింది. బ్రాండ్ ఈ ఆర్ధిక సంవత్సరంలో 40,000 యూనిట్‌లు విక్రయించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇది పాన్ ఇండియాలో 350కు పైగా డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది మరియు ఇది దుడుకుగా విస్తరణ చేపడుతోంది.