దళారుల నుండి అన్నదాతలకు విముక్తి

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించిందని రాష్ట్ర మహిళ మోర్చా నాయకురాలు లలిత తెలిపారు. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఫార్మర్స్‌ప్రొడ్యూస్‌ట్రేడ్‌అండ్‌కామర్స్‌ బిల్లు,ఫార్మర్స్‌అగ్రిమెంట్‌ఆన్ప్రైస్‌అస్యూరెన్స్‌అండ్ఫార్మర్స్‌_సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. కాంగ్రెస్‌, తెరాస, శిరోమణి అకాలీదళ్‌ సహా 14 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పటికీ.. బిల్లులకు ఆమోదం లభించిందని అన్నారు. అన్నదాతలు పడుతున్న కష్టానికి మోడీ సర్కారు అందనుంచిన తీపి కానుకగా పేర్కొన్నారు.