వృద్దుల్లో జ్ఞానపకశక్తి రావడానికి అల్జీమర్స్ వ్యాధి
డాక్టర్. ఎం.వైభవ్
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం.
అల్జీమర్స్ వ్యాధి అనేది కోలుకోలేని మెదడు రుగ్మత. ఇది నెమ్మదిగా జ్ఞాపకశక్తిని, సాధారణ పనులను చేయగల సామర్ధ్యం మరియు ఆలోచన నైపుణ్యాలను నాశనం చేస్తుంది.
ఈ వ్యాధి లక్షణాలు మెదట 60 సంవత్సరాల తరువాత కనిపిస్తాయి. వృద్దుల్లో జ్ఞానపకశక్తి రావడానికి అల్జీమర్స్ వ్యాధి అత్యంత సాదరణ కారణం.
అభిజ్ఞ పనితీరు (జ్ఞాపకశక్తి), ఆలోచన కొల్పోవడం, గుర్తుంచకోలేకపోవడం మరియు ప్రవర్తన సామర్థ్యాలు కొల్పోవడం వలన వ్యక్తి యొక్క జీవితానికి మరియు రోజువారి కార్యకలపాలకు అంతరాయం కలిగిస్తుందని డెమన్షియా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
ఇందులో తేలికపాటి దశని కనీస అభిజ్ఞ బలహీనత అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. ఈదశలో వ్యక్తులను గుర్తించనట్లయితే అల్జీమర్స్‌ని నయం చేయవచ్చు. మతిమరుపు వ్యాధుల్లో నమం చేయగలిగన ఏకైక వ్యాధి ఈ అల్జీమర్స్.
1906లో డాక్టర్ అలోయిస్ అల్జీమర్ పేరుమీదగా అల్జీమర్స్ వ్యాధి పేరు పెట్టడం జరిగింది. అల్జీమర్స్ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి, చదవడంలో, చూడడంలో ఇబ్బందులు మరియు మందిగించిన తార్కికం వంటి గుర్తించలేకపోవడం వంటి అంశాలు కూడా ప్రమేయం ఉండవచ్చు. అల్జీమర్స్ జ్ఞాపకశక్తి రుగ్మత ఉన్న కుటుంబాల్లో కనిపించవచ్చు. జన్యుకారకాలలో పాటు గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి కనిపించవచ్చు. అందుకే ప్రారంభదశలోనే ఈ వ్యాధిని గుర్తించడం వలన పూర్తి స్థాయిలో నివారించవచ్చు. జ్ఞాన వైకల్యం ఉన్న రోగులకు థైరాయిడ్ వ్యాధులు, విటమిన్ బి12, ఫోలెట్ లోపాలు వంటి చికిత్స చేయదగిన కారణాల కోసం పరీక్షించాలి.
క్లినికల్ అనుమానం తరువాత బ్రెయిన్ ఇమేజింగ్ రోగ నిర్థారణను నిర్థారించడంలో సహాయపడుతుంది. ప్రారంభ దశలో అల్జీమర్స్ వ్యాధిని నిర్ధారించడానికి వివిధ బయోమార్కులు ఉన్నాయి.
పోషకాహారం, శారీరక శ్రమ, సామాజిక సృహా మరియు మానసికంగా ఉత్తేజపరిచే ప్రయత్నాలు జ్ఞాపకశక్తి క్షీణత మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.
మందులతో పాటు రోగుల కష్టమైన ప్రవర్తనను ఎదుర్కొవటానికి కుటుంబాలు మరియు వారి సంరక్షకుల మద్దతు చాలా అవసరం . వ్యాధి అవగాహానను ప్రోత్సహించడానికి సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ డేగా ప్రకటించారు.