సిద్ధిపేటలో కాగడాలు చేతబూనిన భాజపా నేతలు
తెలంగాణ సిద్దించిన తరువాత కూడా ప్రజలు స్వేచ్ఛ లేకుండా పోయిందని సిద్ధిపేట భారతీయ జనతా పార్టీ నాయకులు. సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేసింది భాజపా. ఇందులో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టి తమ నిరసలో తెలిపారు సిద్దిపేటలో. పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ ఒకలా..ఇప్పుడు సీఎం కేసీఆర్‌లా దొంగ మాటలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడు ఏపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మమల్ని అవమానిస్తారా సెప్టెంబర్ 17ని అధికారికంగా జరపాలని ఆనాటి సీఎం రోశయ్యను ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఆయన ఇప్పుడు ఎందుకు అధికారికంగా జరపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంకా దొరపాలన కొనసాగుతోందని అన్నారు. రాజకీయ ఎదుగుదలే అతని నైజం అని ఆరోపించారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి… రాష్ట్రంలో తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.