ఇంకా ఎంతమంది అగ్గికి అహుతి కావాలి : రఘునందన్‌రావు
తెలంగాణ కోసం అగ్గికి అహుతైనారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎంత మంది అగ్గికి అహుతికి కావాలని ప్రశ్నించారు భాజపా రాష్ట్ర నాయకులు రఘునందన్‌రావు. ఆనాడు శ్రీకాంతా చారి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్న తర్వాతే ఉద్యమం ఉవ్వేత్తున్న ఎగిసిపడిందన్నారు. ఈనాడు ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ సాక్షాత్తు అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకుని ప్రాణాలు అర్పించేదాక వచ్చిదంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. తెరాస నయవంచన పాలన అందరికి తెలిసే సమయం వచ్చిందని ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ పోరాటల గడ్డ మీద ఇంకా ఎన్ని పోరాటాలు చేయాల్సి వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించిన తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేయడం తెరాస నేతలకు అలవాటైందని విమర్శించారు. ఇంకా తెలంగాణ ముసుగు వెసుకొని బతుకుతారని ప్రశ్నించారు. వారి పబ్బం గడుపుకోవాడికే తప్పా ప్రజలకు చేసిన సేవ ఏమి లేదన్నారు. దుబ్బాక ఎన్నికల తోటి తెరాస పతనం కావడం ఖాయమన్నారు రఘునదంన్‌రావు.