ఈ నెల 21 నుండి అవి కూడా ఓపెన్ చేస్తున్నారు
ఈ నెల 21 నుండి దేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు తాజ్ మహల్, ఆగ్రా కోట ఓపెన్ కానున్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని తెలిపింది. జిల్లాలోని ఇతర స్మారక చిహ్నాలు సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభమయ్యాయి. ఆగ్రా కోట, తాజ్ మహల్ మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా తెరవలేదు. ఒక రోజులో దాదాపు 5,000 మంది పర్యాటకులు తాజ్ మహల్, ఆగ్రా కోటలో రోజుకు దాదాపు 2,500 మంది పర్యాటకులు చూసేందుకు వస్తుంటారు. ఇన్నిరోజుల పాటు తాజ్ మహల్ మొదటిసారి మూసివేశారు. మార్చి 17 నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోట దర్శనానికి పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు అధికారులు.