ఆన్‌లైన్ క్లాస్‌లకు మంచి స్పందన : విద్యాశాఖ
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్ లైన్ విద్యకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ప్రభుత్వం విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించింది. టి.సాట్ నెట్ వర్క్ ఛానళ్ల ద్వార ప్రారంభించిన తెలంగాణ విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అన్ లైన్ పాఠాలు చూసినట్లు టీసాట్.టీవీ యాప్ లో తేలింది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ, సమయం ప్రకారం మంగళవారం మూడవ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు మొదటి రోజు సుమారు 6గంటల పాటు ఆన్ లైన్ క్లాసులు జరిగాయి. తొలిరోజే 11,73, 921 వ్యూస్, 1,56, 658 మంది విద్యార్ధులు సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్క రోజే విద్యార్థుల నుండి స్పందన భారీ ఎత్తున రావడంతో విద్యాశాఖ సంతోషం వ్యక్తం చేసింది.