రాయలసీమలోనే అధిక బైపాస్ సర్జరీలు చేసిన కిమ్స్ సవీర
- 1500పైగా బైపాస్ సర్జరీలు
- కోవిడ్ మహమ్మారి కాలంలో అధికం
- సవీరలో ప్రత్యేక సి.టి ఐసియు
డెక్కన్ న్యూస్ :
అతి తక్కువ సమయంలో అధిక బైపాస్ సర్జరీలు చేసిన ఘనతను కిమ్స్ సవీర హాస్పిటల్ దక్కించుకుంది. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో కూడా అత్యవసరమైన గుండెకి సంబధించిన బైపాస్ సర్జరీలు చేసి రోగులను కాపాడమని తెలిపారు కిమ్స్ సవీర కార్డియోథొరాసిక్ & వ్యాస్కులర్ సర్జన్ డాక్టర్ కె.సందీప్ రెడ్డి. శుక్రవారం కిమ్స్ సవీర హాస్పిటల్‌లో గుండె సంబంధిత రోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సి.టి ఐసియు విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిమ్స్ సవీరలో 1500 పైగా బైపాస్ సర్జరీలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజలు హాస్పిటల్‌కి రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. ప్రధానంగా కరోనా వైరస్ సోకిన వ్యక్తులలో ఎక్కువగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి రక్తం సరఫరాకి ఇబ్బంది ఏర్పుడుతుంది తెలిపారు. దీని వల్ల చేతి, కాళ్ల వేళ్లల్లో గ్యాంగ్‌రిన్ ఏర్పడుతుందన్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వివరించారు. కరోనా వైరస్ వల్ల ఆరోగ్య సమస్యలు దాచుకుంటే అవి మరింత తీవ్రతరం అవుతాయని అన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఐసియు విభాగాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.