అమ‌ర జ‌వాన్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఏపి ప్ర‌భుత్వంసాయం

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాల కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు.

ఏపి ప్ర‌భుత్వ ఎక్స్‌గ్రేషియా..

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరం అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేర్కొ న్నారు. పార్టీ పాలిట్ బ్యూరో స‌మావేశంలో అమ‌ర జ‌వాన్ల‌కు సంతాపంగా మౌనం పాటించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. మానవ సమాజంలో ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు దుర్గా ర్గం… అత్యంత హేయం మ‌ని ఖండించారుజరిగిన దారుణంలో 40 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదం అని ఆవేద‌న చెంఆరు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్య లకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మున్ముందు మరెప్పుడూ ఇలాంటి ఘోరకలి జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని.. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు.