దుబ్బాకలో రఘునందన్‌రావు అవి పంచితే మీకేంటీ బాధ
దుబ్బాకలో ఉప ఎన్నికల నగర మెఘక ముందే తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే రాంలింగారెడ్డి మరణం తరువాత దుబ్బాకలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓటర్ల నాడీ పట్టుకోవడానికి ఇరు పార్టీలు తమ ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాయని. సామాజిక బాధ్యతతో తమ పార్టీ నేత రఘునదంన్ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కరోనా ఐసోలేషన్ కిట్లు పంచితే మీకు వచ్చిన బాధేంటని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు. కరోనాతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీన్ని కూడా రాజకీయం చేయడం సరికాదంటున్నారు. కరోనా సమయంలో సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వమే నిబంధనలు తుంగలో తొక్కుతోందని అంటున్నారు. ఆర్థిక మంత్రికి చేగుంటలో ఎక్కువ మందితో ఎందుకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారని భాజపా నాయకులు నిలదీస్తున్నారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెరాస పొంతనలేని మాటలు మాట్లాడుతోందని అంటున్నారు. ఏదీ ఏమైన ఉప ఎన్నికల నగరా మొగకముందు ఇరు పార్టీల మధ్య ఇలా ఉంటే.. ఎన్నికల తేదీలు ఖరారు అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.