ఎమ్మెల్యే ఇస్తేనే చెక్కు చెల్లుతుందా : రాజశేఖర్ రెడ్డి
సాక్షాత్ ఒక ఎమ్మెల్యే నే కోవిడ్ నిబంధనలు పాటించకుండా…. ప్రజలకు నీతులు ఎలా చెబుతారు అని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ప్రశ్నించారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన నాయకుడు రాజశేఖర్ రెడ్డి.
కోవిడ్ నిబంధనలు ఉల్లంగించి శంకరం పేట(రా) మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసారని ఆరోపించారు. ఓ వైపు కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి ఈ ప్రచార ఆర్భాటాలు ఏమిటి అని , ఎమ్మెల్యే చేతులతో ఇస్తే తప్ప ఆ చెక్కు చెల్లదా అని అయన ప్రశ్నించారు.ఇప్పటికే మండలంలో వారి సొంత పార్టీ నాయకురాలు కరోనాతో మృత్యువాత పడ్డారని అయన గుర్తు చేసారు. అయినా ఈ నాయకులు కళ్ళు తెరవడం లేదని,కరోనాతో బాధపడుతున్న రోగులను పరామర్శించటానికి రాని ఎమ్మెల్యే ఇప్పుడు ప్రచారం కోసం రావటం విడ్డురం అని అయన మండిపడ్డారు.ఓ వైపు గణేష్ ఉత్సవాల పై నియంత్రణ పెడుతూ, మరి మీ బుద్ది ఎందుకు మందగిస్తుందని
ప్రభుత్వం పెద్దలకు చురకలు అంటించారు.