11,200 మార్కును దాటిన నిఫ్టీ, 450 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
ఆర్థిక రంగం నేతృత్వంలో వరుసగా రెండో రోజు కూడా భారత సూచీలు అధికంగా ముగిశాయి.
నిఫ్టీ 1.23% లేదా 138.25 పాయింట్లు పెరిగి 11,385.35 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 1.26% లేదా 477.54 పాయింట్లు పెరిగి 38,528.32 వద్ద ముగిసింది.
సుమారు 1860 షేర్లు పెరిగాయి, 886 షేర్లు క్షీణించగా, 132 షేర్లు మారలేదు.
టాప్ నిఫ్టీ లాభాలలో గ్రాసిమ్ (6.50%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.33%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.01%), జెఎస్‌డబ్ల్యు స్టీల్ (3.12%), మరియు జీ ఎంటర్టైన్మెంట్ (2.70%) అగ్రస్థానంలో ఉండగా, బిపిసిఎల్ (1.25%), టెక్ మహీంద్రా (0.91%), హెచ్‌సిఎల్ టెక్ (0.56%), సిప్లా (0.80%), మరియు ఐఒసి (0.51%) నిఫ్టీ నష్టపోయిన వారిలో ఉన్నాయి.
ఫార్మా రంగంలో స్వల్ప నష్టాలు మినహా అన్ని రంగాల సూచికలు ఆకుపచ్చగా వర్తకం చేశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 1.16 శాతం, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 1.33 శాతం పెరిగాయి.
వాస్కాన్ ఇంజనీర్స్ లిమిటెడ్
వాస్కాన్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరం 21లోని మొదటి త్రైమాసంలో రూ. 37.3 కోట్లు నష్తాం నివేదించిన తరువాత దీని స్టాక్స్ 5.22% తగ్గి రూ.10.90 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. సంస్థ యొక్క ఏకీకృత ఆదాయం 66.8% తగ్గింది.
కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్
సంస్థ యొక్క ఏకీకృత నికర లాభం 8.8% పెరిగింది, సంస్థ యొక్క ఏకీకృత ఆదాయం 1.5% తగ్గింది. కంపెనీ స్టాక్ ధర 6.22% పెరిగి రూ. 241,50 ల వద్ద ట్రేడ్ అయింది..
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
ఈక్విటీ షేర్లు లేదా ఇతర సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా నిధుల సేకరణను పరిగణనలోకి తీసుకునేందుకు జరగబోయే డైరెక్టర్ల సమావేశం ప్రకటించిన పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు 8.72% పెరిగి రూ. 261.90 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
బిర్లాసాఫ్ట్ లిమిటెడ్
ఈ కంపెనీ, మైక్రోసాఫ్ట్ తో ప్రపంచ వ్యూహాత్మక క్లౌడ్ కూటమిని ప్రకటించింది. ఖాతాదారులకు వారి డిజిటల్ ప్రయాణాన్ని వేగవంతం చేయడమే ఈ కూటమి లక్ష్యంగా ఉంది. కంపెనీ స్టాక్స్ 14.69% పెరిగి, ప్రకటన తర్వాత రూ. 172.20 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
వోల్టాస్ లిమిటెడ్
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఎసి తయారీదారు వోల్టాస్ లిమిటెడ్ నికర లాభం రూ.102.86 కోట్లు. కంపెనీ నికర లాభం 30.05%, నికర అమ్మకాలు 50.34% తగ్గాయి. అయితే స్టాక్ ధరలు 2.43% పెరిగి రూ. 644,40 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
జిపిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్
జిపిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కోల్‌కతాలోని మెట్రో రైల్వే ప్రాజెక్టు కోసం కంపెనీ ఆర్డర్‌ను ఆర్జించగలిగిన తరువాత దీని స్టాక్స్ 10.61% పెరిగి రూ. 30.75 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ .196.30 కోట్లు.
సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్
సింగులారిటీ హోల్డింగ్స్ సంస్థ యొక్క 35 లక్షల షేర్లను ఒక్కో షేరుకు రూ. 13.95 ల చొప్పున కొనుగోలు చేసిన తరువాత కంపెనీ స్టాక్స్ 4.66% పెరిగి రూ. 14.60 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
భారతీయ రూపాయి
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోలు కనిపించడంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రూ. 74.75 ల వద్ద ముగిసింది.
బంగారం
బంగారం ధరలు% 2,000 మార్కును అధిగమించి 1% పెరిగాయి. యుఎస్ డాలర్ రెండేళ్ల కనిష్టానికి బలహీనపడటంతో ఇది జరిగింది.
గ్లోబల్ మార్కెట్ సూచనలు
చైనా-యుఎస్ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులలో ఏర్పడిన ఆశావాదంపై బరువు పెరగడంతో ఆసియా మరియు యూరోపియన్ మార్కెట్లు ఉదయం పచ్చగానే ఉన్నాయి. నాస్‌డాక్ 1.00%, ఎఫ్‌టిఎస్‌ఇ 100 0.29 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 0.85 శాతం, నిక్కీ 225 0.20 శాతం, హాంగ్ సెంగ్ 0.08 శాతం పెరిగాయి.