గర్బిణీలు ఈ చిట్కాలు పాటించండి : డాక్టర్ స్రవంతి
కరోనా మహమ్మారి సమయంలో సామాన్యుల కంటే గర్బిణీలు అతి జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రముఖ వైద్యురాలు స్రవంతి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్-19 వైరస్ వణికిస్తోంది. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా కోట్లాది మందికి కరోనా వైరస్ సోకుతుంది. భారతదేశంలో కూడా వైరస్ సంక్రమణ అధికంగా ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలో, చిట్కాలు పాటించాలో ఆమె వివరించారు. ఈ చిట్కాలు పాటించి పడంటి బిడ్డకు మంచి భవిష్యత్తును ఇవ్వండి.
వైరస్ నివారణ కోసం పాటించే చిట్కాలు:
- తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం… సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత (శానిటైజెర్)ని వాడాలి.
- కరోనా వైరస్ లక్షణాలు (Coronavirus Symptoms) అంటే దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం, ఉన్నవారితో దూరంగా ఉండాలి.
- అత్యవసరం అయితే తప్ప ఆసుపత్రికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వైద్యులతో వీడియో కాల్ లో సంభాషించే అవకాశం ఉంటే అది కూడా మంచిదే దానిని ఉపయోగించుకోగలరు.
- గర్భిణీ స్త్రీలు అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. దానితో పాటు బయటి వాళ్ళు వారిని కలవడానికి వస్తే దూరం(Social Distance) పాటించేలా చూసుకోవాలి.
- గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నన్సీ సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత మేర తగ్గుతుంది. వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది వీటివల్ల శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మంచి వెలుతురు, గాలి, ప్రసరించే గదిలో ఉండాలి. (Good ventilation to prevent COVID-19 Coronavirus).
- దానితో పాటు సపరేట్ బాత్రూం ఉంటె మంచిది మరియు పరిశుభ్రమైన ఆహారం, తాగినప్పుడు గోరు వెచ్చని నీరు తాగాలి.
- డెలివరీ సమయంలో ఒక వ్యక్తిని మాత్రమే గర్భిణీ స్త్రీ వద్ద ఉండేట్టు చూసుకోవాలి, వీలయితే సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే ఇంకా మంచిది.
- పుట్టిన శిశువుని తల్లి తప్ప ఎవరు తాకరాదు. చూడాలి అనుకుంటే దూరం పాటించి (Social Distance) తాకకుండా చూడవచ్చు. https://www.youtube.com/channel/UCGO4mWLb71e5fQ_kuo76I6A?view_as=subscriber