స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిన వారిపై దాడి హేయనీయం: తిరుపతి యాదవ్
తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కలిపిస్తున్న యువ పారిశ్రామిక వేత్త లక్కి రెడ్డి తిరుపతి రెడ్డిపై దాడి చేయడం హేయనీయమని తెరాస యువ నేత గద్ద తిరుపతి యాదవ్ అన్నారు. ఉద్యమ సమయాల్లో కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో లక్కి రెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు అని తెలిపారు. కోషెర్ ఫార్మా కంపెనీని జివి రెడ్డి అతని కుమారుడు వశిష్ఠ రెడ్డి దక్కిచుకోవాలి కంపెనీ నుండి తిరుపతి రెడ్డిని తప్పించాలనే ఉద్దేశంతో ఆయనపై దాడి చేశారని విమర్శించారు. సీఎం సొంత నియోజకవర్గంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్న అతనిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి కానీ దాడులు చేయడం సరి కాదు అన్నారు. దాడి వెనకాల ఎవరు ఉన్నా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి యాదవ్ కోరారు.