లాభాలను నమోదు చేసిన మార్కెట్లు; 1.87% ఎగిసిన నిఫ్టీ, 748 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మరియు మారుతి సుజుకి స్టాక్స్‌లో లాభాల మద్దతుతో ఈ రోజు స్టాక్ సూచీలు ఆకుపచ్చగా ముగిశాయి. సెన్సెక్స్ 806 పాయింట్ల గరిష్టాన్ని తాకడంతో బలమైన ర్యాలీతో ఈ రోజు ప్రారంభమైంది, నిఫ్టీ 50 ఇంట్రాడే 11,112 పాయింట్లను తాకింది.
నిఫ్టీ 1.89% పెరిగి 11095.25 పాయింట్ల వద్ద ముగియగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 748 పాయింట్లు పెరిగి 37687.91 పాయింట్లతో ముగిసింది
విస్తృత మార్కెట్లో, ఎస్ అండ్ పి బిఎస్ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం అధికంగా ఉండగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ స్మాల్ క్యాప్ 1.23 శాతం పెరిగింది. హెచ్ -1 బి వీసాపై విదేశీ కార్మికులను నియమించకుండా లేదా కాంట్రాక్ట్ చేయకుండా ఫెడరల్ ఏజెన్సీలను నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన తరువాత, ఈ రోజు అన్ని ఐటి స్టాక్స్ ఎరుపు రంగులో ముగిశాయి. ఐటీ సూచీ 1.58 శాతం తగ్గి ఎన్‌ఎస్‌ఈలో 17,743.65 వద్దకు చేరుకుంది.
వ్యక్తిగత స్టాక్స్
నేటి వాణిజ్యంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బిఎస్‌ఇలో 4 శాతం పెరిగి రూ. 1,041 వద్ద ముగిసింది. ప్రైవేటు రంగ ఋణదాత శశిధర్ జగదీషన్‌ను, ఆదిత్య పూరికి వారసుడిగా ప్రకటించారు. మిస్టర్ పూరి వారసుడి పేరు ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరంగా చర్చనీయాంశంగా మారి ఉంది, ఎందుకంటే మిస్టర్ పూరి యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి కొత్త వ్యక్తికి ఇది ఒక బృహత్కార్యంగా ఉంటుంది.
వోక్‌హార్డ్ట్
వోక్‌హార్డ్ట్ షేర్లు వరుసగా మూడో రోజు వరకు తమ లాభాలను విస్తరించాయి, బిఎస్‌ఇలో ఈ రోజు 10 శాతం ఎగువ సర్క్యూట్ బ్యాండ్‌ను రూ. 334 వద్ద తాకింది. ఈ కంపెనీ, యుకె ప్రభుత్వంతో ఒక ఒప్పందం ప్రకారం, ఆస్ట్రాజెనీకా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వాటితో సహా, కోవిడ్ -19 వ్యాక్సిన్లను మిలియన్ల మోతాదులో సరఫరా చేస్తామని తెలిపింది.
టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన దేశీయ ప్రయాణీకుల వాహన వ్యాపారంలో 49 శాతం వాటాను విక్రయించబోతున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించిన తరువాత ఈ కంపెనీ స్టాక్స్ ఈ రోజు 1.46% క్షీణించి 111.40 రూపాయలకు చేరుకున్నాయి.
ముడి చమురు
ప్రపంచంలో తాజా కోవిడ్ సంక్రమణల తరంగాల ఆందోళనల మధ్య ముడి చమురు ధరలు మంగళవారం రోజున పడిపోయాయి. ఎంసిఎక్స్ వద్ద ముడి ధర 2.29 శాతం తగ్గి రూ. 3230 వద్ద ముగిసింది.
గ్లోబల్ మార్కెట్లు
డియాజియో మరియు బేయర్ నుండి నిరాశపరిచిన ఆదాయ నివేదికలతో యూరోపియన్ మార్కెట్లు మంగళవారం చెడు నోటుతో ప్రారంభమయ్యాయి. రైటింగ్ సమయంలో, యూరోనెక్స్ట్ 100 0.05%, స్విస్ మార్కెట్ ఇండెక్స్ 0.66% తగ్గాయి.