సెక్రటేరియట్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

గత ఏడాదిగా అనేక రకాల విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు.

అయ్యగారు లేకుండా పెళ్లి అవుతుందా,మీరు లేకుండా రాజకీయం ఉంటుందా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వసతి ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్..

సెక్రటేరియట్ లోకి అనుమతించకపోవడంతో సమాచార సేకరణ కోసం అష్టకష్టాలు పడుతున్న జర్నలిస్టులు…

గేటు దగ్గర సెక్రటేరియట్ సిబ్బంది నిలిపివేసి,అవమానకరంగా వ్యవహరిస్తున్నారు..

ఏడాదిగా బజారు బతుకులు అయినవి..

70 ఏళ్లుగా ఉన్న మన హక్కు,ఉమ్మడి రాష్ట్రంలో,ఉద్యమ సమయంలో లేని నిషేధం ఇప్పుడు ఎందుకు..

సీఎస్ కలిసి చెప్పాము..

ఐ అండ్ పీఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ మూడు ప్రతిపాదనలతో సెక్రటేరియట్ మీడియా పాయింట్ కు సిఫారసు చేశారు..

మూడు సిఫారసులు..

బీఆర్కే భవన్ రెండో ఫ్లోర్,

గ్రౌండ్ ఫ్లోర్

ఎమ్మెల్యే క్వార్టర్స్ లలో ఏదో ఒక చోట ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషనర్..

అన్ని ప్రయత్నాల తర్వాత తాత్కాలిక సెక్రటేరియట్ భవనం బీఆర్కే భవన్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు