కడుపులో ఉన్న బిడ్డకు కరోనా… దేశంలోనే తొలి కేసు
నిండు చూలాలు కరోనా పేషెంట్ అయినా..కడుపులోని బిడ్డకు మాత్రం ఇప్పటిదాకా కరోనా రాలేదు. కానీ, దేశంలోనే తొలిసారిగా అలాంటి కేసు ఒకటి నమోదైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు .. తల్లినుంచి కరోనాసోకింది. బిడ్డకు ఆక్సిజన్ , పోషకాలు అందించే మాయే కరోనా వాహకంగా మారింది. దాన్నే వర్టికర్టిల్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డకు తల్లి ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకడమే ఈ వర్టికర్టిల్ ట్రాన్స్మిషన్. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే సాసూ జనరల్ ఆస్పత్రి లో వెలుగు చూసింది. నిజానికి తల్లి ద్వారా ‘పుట్టిన బిడ్డ’కు మాత్రమే ఇన్ఫెక్షన్ సోకుతుందని, పాలిచ్చేటప్పుడు (బ్రెస్ట్ఫీడింగ్) వైరస్గానీ లేదా బ్యాక్రియాటీ గానీ బిడ్డలోకి వెళుతుందని ఆస్పత్రి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఆర్తి కనికర్ చెప్పారు.
అయితే, ఈ చిన్నారి విషయంలో మాత్రంలో కడుపులోనే కరోనా సోకిందని ఆమె తెలిపారు. కాన్పుకు వారం ముందు నుంచే ఆమెకు కరోనా లక్షణాలు న్నాయన్నారు.
గర్భిణులందరికీ టెస్టులు చేయాలన్న ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం.. ఆమెకుటెస్టు చేయగా నెగెటి వ్ వచ్చిందన్నారు. దీంతో కాన్పు చేశామని వివరించారు. పాప పుట్టిందని, వెంటనే ఆ పాప ముక్కు, బొడ్డుపేగు, మాయ నుంచి శాంపి ళ్లుతీసి టెస్ట్చేయగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వెంటనే పాపను వేరే రూమ్లో ఐసోలేట్ చేశామని, మూడు రోజుల్లోనే ఆ చిన్నారికి జ్వరం వంటి లక్షణాలు బయటపడ్డాయని, ఆ లక్షణాలూ తీవ్రంగా ఉన్నాయని డాక్టర్ ఆర్తి చెప్పారు. రెండు వారాల పాటు జాగ్రత్త గా ట్రీట్మెంట్ చేశామని, పాప, పాప తల్లి కోలుకున్నారని చెప్పారు. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపించామని ఆమె చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో రిపోర్ట్తయారుచేస్తున్నామని, ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ చేస్తామని వివరించారు. కాగా, మే చివరి వారంలో ఆ పాప పుట్టిందని, కరోనాకు సంబంధించి దేశంలో ఇదే తొలి వర్టికర్టిల్ట్రాన్స్మిషన్అని సాసూ జనరల్ఆస్పత్రి డీన్ డాకర్్ట మురళీధర్ తంబే చెప్పారు.